శ్రీను వైట్లతో పాటు, స్టార్ రైటర్లు కోన వెంకట్, గోపీమోహన్ కలిసి దూకుడు సినిమా స్క్రిప్ట్ ని రెడీ చేశారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్గా నటించగా, ప్రకాష్ రాజ్, సోనూ సూద్ విలన్లుగా అదరగొట్టారు. బ్రహ్మానందం కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే, జర్మన్ మూవీ ‘గుడ్ బై లెనిన్!’ నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇకథ విషయానికొస్తే.. శంకర్ నారాయణ (ప్రకాష్ రాజ్) ఒకప్పటి ఎమ్మెల్యే. ఆయన కొడుకు అజయ్ కుమార్ (మహేష్ బాబు) పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. కోమా నుంచి బయటపడిన తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో, ఆయన కల నెరవేర్చడం కోసం ఎమ్మెల్యేగా నటిస్తాడు అజయ్. అదే సమయంలో తండ్రి శత్రువులపై పగ తీర్చుకుంటాడు. యాక్షన్, కామెడీ, ఎమోషన్ కలగలిపిన ఈ కథ అందరినీ కట్టిపడేసింది.
2011 సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా 1800 థియేటర్లలో ‘దూకుడు’ రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయ్యాక సూపర్ హిట్ టాక్ వచ్చింది. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పట్లో టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 101 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రిక అయితే ఈ సినిమాని “మీరు ఎప్పుడూ వినని బిగ్గెస్ట్ హిట్” అని పొగిడేసింది.
సాధారణంగా సినిమాలు వారం, రెండు వారాల్లోనే థియేటర్ల నుంచి వెళ్లిపోతాయి. కానీ, ‘దూకుడు’ మాత్రం ఏకంగా 50 రోజులు 312 సెంటర్లలో, 100 రోజులు 63 సెంటర్లలో ఆడింది. అంటే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అనేది మీరే అర్థం చేసుకోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు, యూత్ కూడా ఈ సినిమాకి ఫిదా అయిపోయారు.
విమర్శకులు కూడా ‘దూకుడు’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ “ఫుల్ ఎంటర్టైన్మెంట్” సినిమా మహేష్ బాబు ఫ్యాన్స్‌కి ట్రీట్ అని చెప్పవచ్చు. మొత్తానికి యాక్షన్, కామెడీ, ఎమోషన్స్ పర్ఫెక్ట్ మిక్స్‌తో ‘దూకుడు’ తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.