గేమ్ ఛేంజర్ లాంటి అతి పెద్ద డిజాస్టర్ సినిమాతో టాలీవుడ్ లో 2025 ప్రారంభమైంది. దిల్ రాజు లాంటి నిర్మాత.. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్ ఇవన్నీ కలిసి కూడా గేమ్ ఛేంజర్ సినిమాను ఎంత మాత్రం కాపాడలేకపోయాయి. గేమ్ ఛేంజర్ రామ్ చరణ్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ సినిమాలలో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమాతో దిల్ రాజు ఎంత నష్టపోయారు అన్న లెక్కలు తేలుతున్నాయి. కనీసం అటూ ఇటూ గా 150 కోట్లు కచ్చితంగా నష్టపోయి ఉంటారన్న చర్చలు ట్రేడ్ వర్గాలు చెబుతున్న అంకె. సాధారణంగా ఇలాంటి భారీ డిజాస్టర్ తర్వాత నిర్మాతలను ఆదుకోవడానికి సదరు హీరో తో పాటు దర్శకుడు ముందుకు వస్తారు. మరో సినిమా తీసి పెడతాం అని మాట ఇస్తారు.


శంకర్ తో దిల్ రాజు మళ్ళీ ఆ తప్పు చేయడు. ఇక మిగిలింది రాంచరణ్ మాత్రమే. గేమ్ ఛేంజ‌ర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత దిల్ రాజుకు అభయహస్తం అందించాడని.. మీ బ్యానర్లు మరో సినిమా చేస్తా అని భరోసా అందించాడు అన్న ప్రచారం గట్టిగా నడిచింది. దిల్ రాజు కూడా చరణ్ కోసం ఒక క‌థ‌ సిద్ధం చేసే పనిలో ఉన్నాడని ఆ సినిమాతో నష్టాలను భర్తీ చేద్దామని భావిస్తున్నాడని ఒక్కటే వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధం అని రాంచరణ్ పిఆర్ టీం కొట్టి పడేసింది. చరణ్‌ ప్రస్తుతం బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తున్నాడని.. ఆ తర్వాత సుకుమార్ సినిమా ఉంటుందని ఇవి మినహా చరణ కొత్త సినిమాలు ఏం ఒప్పుకోలేదని మీడియాలో వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని చరణ్ పిఆర్ టీం క్లారిటీ ఇచ్చేసింది.


బుచ్చిబాబు సినిమాతో రామ్ చరణ్ కు 2025 గడిచిపోతుంది. 2026 సగం అయిన ఆశ్చర్యపోనక్కర్లేదు. సుకుమార్ సినిమా అంటే కనీసం రెండేళ్ల‌ సమయం తీసుకోవాలి అంటే 2027 వరకు రామ్ చరణ్ ఖాళీగా ఉండడు. ఆ తర్వాత రాజు ఎవరో మంత్రి ఎవరో తెలియదు కూడా..! తన సినిమా ప్లాప్ అయింది కాబట్టి తనకు మరో సినిమా చేసి పెట్టమని హీరోలను అడగడు హీరోల వెంట తిరిగే మనిషి కూడా కాదు. దిల్ రాజుకు తాత్కాలిక ప్రయోజనాలు కంటే శాశ్వత ప్రయోజనాలకే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఈ సినిమాతో పోతే మరో సినిమాతో రాబట్టుకోవడం ఎలా అన్నది దిల్ రాజు ఆలోచన. గేమ్ ఛేంజర్ నష్టాలను దిల్ రాజుకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా భర్తీ చేసింది కాబట్టి దిల్ రాజుకు ఆ సమస్య కూడా లేదని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: