ఫోటోల విషయానికి వస్తే ప్రకాష్ రాజ్ కుంభమేళలో స్నానం చేస్తూ ఉన్న ఒక ఫోటో తెరమీదకి రావడం జరిగింది. నదిలో స్నానం చేస్తున్న ఫోటో వైరల్ గా మారడంతో ఈ విషయం పైన ప్రకాష్ రాజ్ ఇలా స్పందిస్తూ తన ట్విట్టర్ నుంచి ఇది నకిలీ వార్త ఇలాంటి తప్పుడు వార్తలను ఎవరు ప్రచారం చేయవద్దండి.. వారి పవిత్ర పూజలను కూడా కలుషితం చేయడం మంచిది కాదు అంటూ తెలియజేశారు. దీనిపైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానంటూ తెలిపారు ప్రకాష్ రాజ్.
అసలు నిజం ఏంటన్నది కూడా కోర్టే తెలుస్తుందని ఇలా చేయడం సిగ్గుచేటు అంటూ ప్రకాష్ రాజ్ కన్నడలో ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. మొదట మహా కుంభమేళలో ప్రకాష్ రాజు పాల్గొన్నారు కానీ అది డీప్ ఫేక్ టెక్నాలజీ తో చేసినటువంటి ఫోటో అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ప్రకాష్ రాజు కూడా డీప్ ఫేక్ బారిన పడడం జరిగింది. ఈ మధ్యకాలంలో సినిమాలలో తగ్గించారు ప్రకాష్ రాజ్ దేవర సినిమాలో కూడా విభిన్నమైన పాత్రలో నటించారు. మరి రాబోయే రోజుల్లో కూడా ప్రకాష్ రాజ్ సినిమాలకి స్వస్తి చెప్పి పొలిటికల్ వైపు గాని ఎక్కువగా అడుగులు వేస్తారేమో చూడాలి.