మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తరువాత మళ్లీ సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి వంటి చిత్రాల తరువాత మళ్లీ ఆ జానర్‌ను టచ్ చేయబోతోన్నాడు. అయితే చిరంజీవి ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా చేస్తున్నాడు అనగానే ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ పై మంచి హైప్ ఉంది.మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల బయటకొచ్చింది. చిరు లుక్స్ బాగున్నాయని ఫ్యాన్స్ ఆనందపడ్డారు. అసలుకైతే 2025 జనవరి 10 న అంటే సంక్రాంతి కానుకగా ‘విశ్వంభర’ ని విడుదల చేయాలనుకున్నారు. చిరు కూడా పట్టుబట్టి అదే డేట్ కి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా టీంతో పని చేయించారు. కానీ ‘ ‘గేమ్ ఛేంజర్’ సినిమా కొన్ని కారణాల వల్ల క్రిస్మస్ బరి నుండి తప్పుకోవడంతో సంక్రాంతికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొడుకు సినిమా కాబట్టి.. చిరు కూడా తగ్గి విశ్వంభర ని వాయిదా పడేలా చేశారు అని అంతా అనుకుంటున్నారు. కానీ ఇన్సైడ్ టాక్ వేరే ఉంది. ‘విశ్వంభర’ వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో టీం సంతృప్తి చెందలేదట. ఆడియన్స్ రియాక్షన్ ని చెక్ చేయడం కోసమే టీజర్ ని వదిలారట.

అనుకున్నట్టే సోషల్ మీడియాలో నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో కొంచెం టైం తీసుకుని సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిరు అండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అనుకుంటున్న డేట్ అయితే మే 9 అని తెలుస్తుంది. అదే డేట్ కి గతంలో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టింది. చిరుకి మే నెలలో ‘గ్యాంగ్ లీడర్’ వంటి ఆల్ టైం హిట్లు పడ్డాయి.పైగా సమ్మర్ హాలిడేస్ సీజన్, చిన్న పిల్లలు చూసే సినిమా కూడా కాబట్టి ఆ డేట్ కే ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు రావచ్చని తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈరోజుల్లో సినిమాల్లోని ప్రతీ అంశాన్ని ప్రేక్షకులు చాలా శ్రద్ధతో చూస్తున్నారు. ప్రతీ చిన్న విషయాన్ని గమనిస్తున్నారు. అందుకే మేకర్స్ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అదే సీనియర్ హీరోల సినిమాలంటే ఆ జాగ్రత్తలు మరింత ఎక్కువగానే ఉండాలి. కానీ ‘విశ్వంభర’ విషయంలో ఎక్కడో క్లారిటీ మిస్ అయ్యింది. వశిష్ట లాంటి యంగ్ డైరెక్టర్‌తో చిరంజీవి సినిమా అంటే కచ్చితంగా బాగానే ఉంటుందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అంతే కాకుండా సోషియో ఫ్యాంటసీ మూవీ అనగానే దీనిపై అంచనాలు పెంచేసుకున్నారు. కానీ కొన్నాళ్ల క్రితం విడుదలయిన టీజర్‌కు నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: