సాధారణంగా ఒక హీరో తన సినిమా పబ్లిసిటీ చేసుకోవడానికి ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఉంటాడు.  అయితే ఆ ప్రమోషన్స్ లో మాత్రం ఎక్కడా తన పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చే విధంగా మాట్లాడాడు.  చాలామంది హీరోస్ ఇలాగే చేస్తూ ఉంటారు . ఎవరో అడపాదడపా హీరోలు మాత్రమే తమ పర్సనల్ లైఫ్ ని స్టేజిపై మాట్లాడుతూ సినిమాకి ప్రమోషన్స్ నిర్వహించుకోవడానికి ఎక్కువగా  ఇంట్రెస్ట్ చూపిస్తూ  ఉంటారు . అయితే ఆల్రెడీ స్టార్స్ అయిపోయిన హీరోస్ మాత్రం అలా చేయనే చేయరు.  కానీ నాగచైతన్య మాత్రం అలా చేసి ఇప్పుడు స్పెషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతున్నాడు . మనకు తెలిసిందే నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .


భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాల్లో హీరోయిన్గా సాయి పల్లవి నటించింది.  రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై హ్యూజ్ హైప్స్ పెంచేసింది . కాగా వైజాగ్ లో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు మూవీ మేకర్స్.  ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాగచైతన్య మాట్లాడుతూ కూసింత ఓవర్ యాక్టింగ్గా బిహేవ్ చేశాడు అన్న కామెంట్స్ దక్కించుకున్నాడు. " ఏ సినిమా రిలీజ్ అయిన మొదట వైజాగ్ టాక్ కనుక్కుంటూ ఉంటాము . వైజాగ్ లో సినిమా ఆడితే ప్రపంచంలో ఎక్కడైనా ఆడేస్తుంది అన్న నమ్మకం . వైజాగ్ నాకు ఎంతో ఇష్టం . అందుకే నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను . నా ఇంట్లో కూడా ఇప్పుడు ఒక వైజాగ్ ఉంది .



"నా ఇంట్లో రూలింగ్ పార్టీ నే ఉంది . నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ దే.  తండేల్ సినిమాకు వైజాగ్ లో కలెక్షన్స్ షేక్ అయిపోవాలి .. లేకపోతే నా ఇంట్లో పరువు పోతుంది " అంటూ సరదాగా శోభిత ధూళిపాళ్ల ని ఉద్దేశిస్తూ తన భార్య పట్ల తనకి ఎంత ప్రేమ ఉందో .. చెప్తూనే సినిమాకి ప్రమోషన్స్ నిర్వహించుకున్నాడు నాగచైతన్య.  దీంతో ఒక వర్గం ప్రేక్షకులు నాగచైతన్య నాటీ కామెంట్స్ ను లైట్గా తీసుకున్న ..ఎప్పుడు సోషల్ మీడియాలో నాగ చైతన్య ని ట్రోల్ చేసే వాళ్ళు మాత్రం నాగచైతన్య పై నెగిటివ్గా మాట్లాడుతున్నారు . మీ వేషాలన్నీ ఇంట్లో వేసుకో స్టేజిపై కాదు సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా చేస్తావా..? ప్రపంచంలో వైజాగ్ అమ్మాయి నీ భార్య ఒక్కటేనా..? అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . మరి కొందరు వీడు మరి టూమచ్ చేసేస్తున్నాడు రా బాబోయ్ అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు నాగచైతన్య తండేల్ సినిమా  ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు బాగా ట్రోల్లింగ్ కి గురవుతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: