అభినయ..హీరోయిన్ల కి ఏ మాత్రం తీసిపోని అందంతో ఉండే ఈ హీరోయిన్ ని చూస్తే కొంతమంది హీరోయిన్స్ సైతం కుళ్లుకుంటారు. ఎందుకంటే మాటలు రాకపోయినప్పటికీ చెవులు వినిపించకపోయినప్పటికీ తన సైన్ లాంగ్వేజ్ తోనే సినిమాల్లో అద్భుతంగా నటిస్తూ అసలు ఈమె మూగదేనా అనే అనుమానం చాలా మందిలో కలిగిస్తూ ఉంటుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్ గా పని అనే మలయాళం మూవీలో అత్యాచార సన్నివేశం లో నటించిన అభినయ వివాదానికి గురైంది.అయితే ఈ అత్యాచార సన్నివేశం గురించి కూడా అభినయ క్లారిటీ ఇచ్చింది.ఈ విషయం పక్కన పెడితే..తాజాగా తన ప్రేమ గురించి షాకింగ్ విషయం చెప్పింది అభినయ.. అయితే చాలా రోజుల నుండి విశాల్ అభినయ మధ్య ప్రేమ ఉందని,వీరిద్దరూ లవర్స్ అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

 ఇక విశాల్, అభినయ కాంబోలో మార్క్ ఆంటోనీ మూవీ వచ్చింది.అయితే ఈ రూమర్లపై అభినయ స్పందించి అలాంటిదేమీ లేదు విశాల్ కి నేను పెద్ద అభిమానిని కొట్టిపారేసింది.అలాగే విశాల్ కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా తన ప్రేమ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది అభినయ. తన సైన్ లాంగ్వేజ్ తో ఈ విధంగా చెప్పింది.నేను 15 సంవత్సరాలుగా ఒక అబ్బాయి తో ప్రేమలో ఉన్నాను. ఆ అబ్బాయి నా స్నేహితుడే.. నేను ఆయనతో చదువుకున్న రోజుల్లోనే ప్రేమలో పడ్డాను. అలా 15 సంవత్సరాలుగా మా మధ్య ప్రేమాయణం నడుస్తోంది.త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అంటూ అభినయ చెప్పుకొచ్చింది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభినయకు మీరు సింగిల్గానే ఉన్నారా లేక ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నారా అనే ప్రశ్న ఎదురవడంతో తన మనసులో ఉన్న మాట బయట పెట్టింది. దీంతో అభినయ విశాల్ గురించి వస్తున్న రూమర్లకు చెక్ పడినట్లు అయింది. మరి ఇంతకీ అభినయనను పెళ్లి చేసుకోబోతున్న ఆ అదృష్టవంతుడు ఎవరో చెప్పాలి అని ఆమె ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: