టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు తాజాగా పద్మభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పద్మభూషణ్ ప్రకటన అనంతరం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా స్పందించడం జరిగింది. అయితే తాజాగా బాలయ్యకు పద్మభూషణ్ రావడాన్ని అభినందిస్తూ నందమూరి, నారా కుటుంబాల పేర్లతో ఒక ఫుల్ పేజీ యాడ్ ఇవ్వడం జరిగింది.
 
అయితే ఆ పేర్లలో జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని పేరు కానీ, జూనియర్ ఎన్టీఆర్ పేరు కానీ, కళ్యాణ్ రామ్ పేరు కానీ లేకపోవడం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ తగ్గుతున్నా బాలయ్య మాత్రం జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఒకింత సీరియస్ గానే వ్యవహరిస్తూ ఉండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. బాలయ్య ఈ విధంగా చేయడం రైటేనా అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
ప్రతి కుటుంబంలో చిన్నచిన్న మనస్పర్ధలు సాధారణం అనే సంగతి తెలిసిందే. అంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్ పై, ఆయన కుటుంబంపై జీవితాంతం సీరియస్ గా ఉండటం ఎంతవరకు రైట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అటు బాలయ్య ఇటు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా వరుస విజయాలు సాధిస్తూ తమ సక్సెస్ తో ప్రశంసలు అందుకుంటూ సత్తా చాటుతున్నారు.
 
బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ కలిసి సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్న తరుణంలో అందుకు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండటం గమనార్హం. బాలయ్య, ఎన్టీఆర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ పరంగా అంతకంతకూ ఎదుగుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. నందమూరి హీరోల రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. బాలయ్య రెమ్యునరేషన్ 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండటం గమనార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: