గేమ్ చేంజర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా హీరో రామ్ చరణ్ నటించిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే థియేటర్లలో భారీగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా అసలు బాగోలేదని కొంతమంది అన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం భారీగా వస్తున్నాయి. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా.... దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను దాదాపు రూ. 450 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.


ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. కాగా, ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ సంవత్సరం డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ ఇలా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించారు. డాకు మహారాజ్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు.


ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా చూసినా కూడా దిల్ రాజుకే లాభాలు వస్తాయని అభిమానులు అంటున్నారు. అతనికి టాలెంట్ చాలా ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అలాగే మన తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఏరియాలో గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రెండు సినిమాల థియేటర్ రైట్స్ ని కలిపి దిల్ రాజు అమ్మేశారట. దాంతో ఒక్క బయ్యర్ కూడా నష్టాల బాట పట్టలేదు. లాభాలే సంపాదించారు.


తెలుగు రాష్ట్రాలలో ఈ రెండు సినిమాల థియేట్రికల్ రైట్స్ ను దిల్ రాజు దాదాపు రూ. 155 కోట్లకు అమ్మేశారట. ఈ రెండు సినిమాలు కలిపి ఇప్పటికే తెలుగు స్టేట్స్ లో రూ. 180 కోట్ల దాకా షేర్ కలెక్షన్లను రాబట్టాయి. ఇందులో ఎక్కువ శాతం కలెక్షన్లు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా వచ్చాయి. మొత్తానికి దిల్ రాజుకు ఏ వైపు చూసినా భారీగా లాభాలు వచ్చాయి. ఈ విషయం తెలిసి ప్రేక్షకులు దిల్ రాజు తెలివి మామూలుది కాదని, అతనికి భారీగా లాభాలు వచ్చాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: