శోభిత కూడా ఇదివరకే ఒప్పుకున్న సినిమాలలో నటిస్తూ ఉంది. మరి శోభిత ఎప్పటిలానే వరుస పెట్టి సినిమాలు చేస్తుందా లేకపోతే తన పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తుందా అనే ఆందోళనలో అక్కినేని అభిమానులు ఉన్నారు. కొంతమంది శోభిత సినిమాలు చేయకూడదని అంటున్నారు. మరి ఈ విషయంపై శోభిత ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం తెలియదు. గతంలోనే శోభిత తన వివాహానికి ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఆ ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందులో శోభిత అబ్బాయిలపై హాట్ కామెంట్ చేసింది. మీడియాలో పనిచేసే నా ఫ్రెండ్ నన్ను ఎంకరేజ్ చేయడంతో నా ధ్యాస మిస్ ఇండియా పోటీల పైన పడిందని శోభిత వెల్లడించారు. ఆ పోటీలో పాల్గొనాలని ముందుగా అనుకోలేదని శోభిత అన్నారు. కేవలం మా కాలేజీలో అబ్బాయిలను ఆకర్షించడానికి నేను మిస్ ఇండియా పోటీలలో పాల్గొనాలని అనుకున్నానని హాట్ కామెంట్స్ చేశారు.
అనంతరం మిస్ ఇండియా పోటీల్లోకి ప్రవేశించిన తర్వాత రెండు మూడు రౌండ్లలో విజయం సాధించిన తర్వాత మిస్ ఇండియా పోటీలపై ఆశ మరింతగా పెరిగిందని శోభిత అన్నారు. దీంతో శోభిత గతంలో మాట్లాడిన ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. ఇందులో శోభిత అబ్బాయిలను ఆకర్షించడానికి పోటీలలో పాల్గొనాలనుకున్నానని అనడంతో ఈ మాటలపై శోభితను ట్రోలింగ్ చేస్తున్నారు. శోభితకు అబ్బాయిల పిచ్చి విపరీతంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై శోభిత ఎలా స్పందిస్తుందో చూడాలి.