చిత్ర పరిశ్రమలో చిన్న సినిమా , పెద్ద సినిమా , మీడియం సినిమా .. బడ్జెట్‌ను బట్టి నిర్మాతలు చేసే వర్గీకరణలు ఇవే .. అయితే చిత్ర పరిశ్రమకు చిన్న సినిమాలే ఎంతో ఆధారం .. ఎందుకంటే ప్రధానంగా ఉన్న మార్కెట్లో భారీ సినిమాల ఫలితాలు తారుమారవుతున్నాయి .. ఇదే క్రమంలో కనీసం 30 సినిమాలుకుపైగా చిన్న సినిమాలు షూటింగ్ ద‌శ‌లు లో ఉంటున్నాయి .. అలాగే చిన్న సినిమాల వల్లే పనులు దొరుకుతున్నాయి .. ఈ క్రమంలో మీడియం సినిమాలను కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదు .. టైర్ 2 హీరోలతో మీడియం రెంజ్‌ సినిమాలు ఎప్పుడు వర్కౌట్ అవుతూ ఉంటాయి.. ఇదే క్రమంలో టాలీవుడ్ బ‌డా నిర్మాతలు కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో మీడియం రెంజ్‌ సినిమాల పైన ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది .. స్టార్ హీరోతో పెద్ద సినిమా తీయటం కంటే అదే బడ్జెట్ తో నాలుగు మీడియం రేంజ్‌ సినిమాలు తీయడం వల్ల నిర్మాతలకు భారీ లాభాలు అందుకొవ‌చ్చున‌ ప్లానింగ్ లు వేసుకుంటున్నారు.


ఇదే క్ర‌మంలోనాగవంశీ నిర్మాతగా ఉన్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుంచి వ‌చ్చిన‌ సినిమాల్లో అధిక శాతం మీడియం సినిమాలే  ఈ సంస్థకు ఎక్కువ శాతం లాభాలు తెచ్చిపెట్టాయి .. మ్యాడ్, టిల్లు, టిల్లు స్క్వేర్‌, సార్‌, ల‌క్కీ భాస్క‌ర్ ఇవన్నీ మీడియం రేంజ్‌ సినిమాలు .. వీటితోనే సితార నాగ వంశీ ఎక్కువ లాభాలు తెచ్చుకున్నాడు .. ఈ సంస్థ పేరు చిత్ర పరిశ్రమలో బాగా పాపులారిటీ తెచ్చుకుంది .. ప్రస్తుతం సితార బ్యానర్లో సంవత్సరానికి ఒక పెద్ద సినిమా వస్తుంటే మీడియం బడ్జెట్ సినిమాలు నాలుగు లైన్లో ఉంటున్నాయి .. అలాగే టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న దిల్ రాజు కూడా ఇప్పుడు ఇదే రూట్ లో పయనిస్తున్నాడు .. ఈ సంక్రాంతికి దిల్ రాజ్ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ మూవీ గేమ్ చేంజర్ .. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అయింది .. మీడియం బడ్జెట్ తో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ  ఊహించని రేంజ్ లో క‌ల‌క్ష‌న్ల‌ వర్షం కురిపిస్తుంది .. గేమ్ చేంజర్ దెబ్బతో దిల్ రాజు కూడా మీడియం రేంజ్‌ సినిమాలే బెటర్ అని ఓ నిర్ణయానికి వచ్చేసారట..


చిత్ర పరిశ్రమలో ఒక సంస్థకు పేరు నమ్మకం ఉన్నప్పుడు  ఓటీటీ, నాన్ థియేట్రిక‌ల్ రైట్స్  ఈజీగా అమ్ముడైపోతాయి .. అలాగే మీడియం రేంజ్‌ సినిమాలు వాటితోనే సగానికి పైకెగా లాభాలు తెచ్చుకుంటాయి .. అలాగే రిస్క్ కూడా తక్కువ .. అన్ని అనుకున్నట్టు జరిగితే భారీ లాభాలు కూడా తెచ్చుకోవచ్చు .. ఒక సినిమాలో పోయిన మరో సినిమాతో భారీ లాభాలు తెచ్చుకోవచ్చన్న భరోసా ఉంటుంది .. టాలీవుడ్ లో ఉన్న బడ నిర్మాతలు బివిఎస్ ప్రసాద్ , డివివి దానయ్య లాంటి నిర్మాతలు కూడా తమ సంస్థల నుంచి ఇప్పుడు మీడియం సినిమాల‌నే ఎక్కువ తీసుకువస్తున్నారు.. అలాగే వైజయంతి మూవీస్, స్వప్న మూవీస్ కూడా ఇదే తరహా కథ‌లని ఎక్కువ నమ్ముకుంటుంది .. ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న పరిస్థితి చూస్తుంటే టైర్ 2 హీరోలకు వాళ్ళ సినిమాలు కు మంచి గిరాకీ వచ్చినట్టు కనిపిస్తుంది .. ఎప్పుడైనా చిత్ర పరిశ్రమలో సమతుల్యం అనేది ఎంతో ముఖ్యం .. అన్ని రకాల సినిమాలు ప్రేక్షకులు ముందుకు రావాల్సిందే .. అప్పుడే బ్యాలెన్స్ అన్ని వైపులా కనిపిస్తుంది .. అయితే చిత్ర పరిశ్రమలో ఉన్న‌ నిర్మాతలు ట్రెండ్ ఫాలో అవుతాం అలవాటు పడిన వారు ఇప్పుడు మీడియం సినిమాలపై దృష్టి పెట్టారు .. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది కాలమే నిరూపించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: