ఆ పోస్ట్ లో ఉపాసన అంజనా దేవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఉపాసన అంజనా దేవితో కలిసి దిగిన ఓ ఫొటోని షేర్ చేసింది. 'మా అందరినీ ఎంతగానో ప్రేమించే మరియు ఎంతో క్రమశిక్షణ కలిగిన నానమ్మకు హ్యాపీ బర్త్‌డే. నీతో కలిసి జీవించడం ఎంతో సంతోషంగా ఉంది. యోగా క్లాస్ పూర్తైన తర్వాత మా ముఖాల్లో మెరుపు చూడండి. ఆమె ఒక్క క్లాస్ కూడా మిస్ కాలేదు. నిజంగా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన విషయం ఇది' అని ఉపాసన రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ చూసిన కొందరు సినీ ప్రముఖులు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన గతంలో కూడా ఒకసారి అంజనా దేవి ఫోటో షేర్ చేస్తూ.. కుటుంబానికి బలం, దైర్యం మీరే నాన్నమ్మ.. కుటుంబ విలువలు, ఓర్పు, సహనం, క్రమశిక్షణ వంటి విషయాలను మీ నుంచి నేర్చుకున్నామని చెప్పుకొచ్చారు. ఇక రామ్ చరణ్ ఉపాసన విషయానికి వస్తే వీరిద్దరూ భార్యాభర్తల్లా కాకుండా స్నేహితుల్లా ఉంటారు. అలాగే ఒకరి వృత్తిని మరొకరం గౌరవిస్తారు కూడా. ఇకపోతే రామ్ చరణ్ ఫ్యామిలీ సెలబ్రిటీ ఫ్యామిలీ మాత్రమే కాదు.. ఓ బిజినెస్ ఫ్యామిలీ కూడా అని ఓసారి ఉపాసన చెప్పిన విషయం తెలిసిందే.