తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలకృష్ణ మొదటి వరుసలో ఉంటారు. వీరిద్దరు కూడా ఎన్నో సంవత్సరాలుగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలలో నటిస్తూ ఎన్నో విజయాలను అందుకొని ఇప్పటికి కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే గత కొంత కాలంగా బాలకృష్ణసినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను ఓకే చేస్తూ ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. దానితో బాలకృష్ణ హీరోగా రూపొందిన సినిమాలు చాలా తక్కువ సమయం లోనే ఒక దాని తర్వాత ఒకటి విడుదల అవుతూ వస్తున్నాయి.

చిరంజీవి మాత్రం ఒక సినిమా పూర్తి అయిన తర్వాత మరి కొంత కాలానికి ఒక సినిమాను ఓకే చేస్తూ రావడంతో చిరంజీవి హీరోగా నటించిన సినిమాల మధ్య గ్యాప్ చాలా పెరిగిపోతూ వస్తుంది. ఇక చిరంజీవి కూడా బాలయ్య రూట్ ను ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే చిరంజీవి ఏకంగా మూడు మూవీలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. చిరంజీవి మరికొన్ని రోజుల్లోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ షూటింగ్ లు కూడా మరికొన్ని రోజుల్లోనే మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత చిరంజీవి , శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ రెండు మూవీ ల తర్వాత వాల్టేర్ వీరయ్య మూవీ దర్శకుడు అయినటువంటి బాబి కొల్లి దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి కూడా చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా చిరంజీవి ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో మూడు మూవీలను ఓకే చేసి చాలా స్పీడ్ గా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: