టాలీవుడ్ లో జరిగిన ఐటీ దాడుల దెబ్బతో అగ్ర నిర్మాతలో భయం పట్టుకుంది .. ఎప్పుడు ఎవరిపై ఎలాంటి దాడి జరుగుతుందో అర్థం కాక నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి .. టాలీవుడ్ అగ్ర‌ నిర్మాతలకు రీసెంట్గా ఐటి అధికారులు ఇచ్చిన షాక్ తో పలు సినిమాలకు సంబంధించిన అనౌన్స్మెంట్లు చేయాలన్నా సరే సినిమా యూనిట్‌లు తెగ భయపడే పరిస్థితి వచ్చింది .. పుష్ప , గేమ్ చేంజర్‌ సినిమాల హడావుడి ఇప్పుడు టాలీవుడ్‌ను గందరగోళంలో పడేస్తుంది . అస‌లు సినిమాలు అనౌన్స్మెంట్ లే  ఐటీ అధికారులు టాలీవుడ్ పై ఫోకస్ పెట్టడానికి  అవే కారణమని ఒక ఒపీనియన్ కి వచ్చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ బాక్స్ ఆఫీస్ పై పాన్ ఇండియా సినిమాలు లైన్లో ఉన్నాయి .. అందులో దాదాపు ప్రభాస్ సినిమాలే ఏడు ఉన్నాయి .. ఇవి కూడా భారీ బడ్జెట్ తో రాబోతున్నాయి.


అంతేకాకుండా మహేష్ బాబు రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ కూడా భారీ బడ్జెట్ సినిమానే .. ఇక దీంతో ఈ సినిమాల విషయంలో నిర్మాతలు అలాగే డైరెక్టర్లు కూడా తెగ కంగారు పడుతున్నారు .. ఇక రీసెంట్గా మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో రాజమౌళి చాలా పక్కాగా  బడ్జెట్ విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నట్టు టాక్‌ .. అలాగే ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా లీక్‌ కాకుండా జాగ్రత్తగా ఉంటున్నాడు . అలాగే అనవసరమైన అప్డేట్లు హడావుడి.   లేనిపోని ప్రచారం వద్దని రాజమౌళి జాగ్రత్తగా ఉంటున్నట్టు తెలుస్తుంది . అలాగే సినిమా రిజ‌ల్ట్ పై మాత్రమే తన దృష్టి ఉండాలని .. కలెక్షన్లపై దృష్టి పెట్టవద్దని రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది .. అదే విధంగా ఈ సినిమాపై హాలీవుడ్ మీడియాలో కొన్ని వార్తలు కూడా బయటకు వస్తున్నాయి .. అయితే ఇప్పుడు ఈ సినిమా యూనిట్ తో అలాగే టెక్నీషియన్స్ తో రాజమౌళి నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ రాయించుకున్నట్టు తెలుస్తుంది .  ఇప్పుడు ఈ ఎగ్రిమెంట్ ప్రకారం సినిమాకు సంబంధించి ఎలాంటి విషయాలు ఎప్పుడూ బయట చెప్పడానికి వీల్లేదు.


అలాగే దర్శక నిర్మాతల అనుమతి లేకుండా ఎవరైనా సినిమాకి సంబంధించిన సమాచారాన్ని ఎక్కడైనా లీక్ చేసిన బయటికి చెప్పిన .. వారికి భారీ స్థాయిలో జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది అంటూ రాజమౌళి క్లియర్గా అందరికీ వార్నింగ్ ఇచ్చేశాడు .. అంతేకాకుండా ముఖ్యంగా ఈ సినిమా బడ్జెట్ గురించి కూడా ఎక్కడా మాట్లాడొద్దని అందరికీ గట్టి క్లాస్ ఇచ్చాడు .. అంతేకాకుండా ఈ సినిమా బడ్జెట్ కు సంబంధించి పలు యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడైనా హడావుడి చేసి కొన్ని రకాల వార్తలు పుట్టించిన సరే వాటిపై చర్యలు తీసుకోవడానికి కూడా రాజమౌళి రెడీ అవుతున్నట్టు టాక్‌ .. రీసెంట్గా టాలీవుడ్ నిర్మాతలు పై జరిగిన ఐటి దాడులే రాజమౌళి లో ఈ మార్పుకు కారణమని తెలుస్తుంది .. ఎందుకంటే రాజమౌళి దగ్గర నుంచి వచ్చే ప్రతి సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లు రాబడుతుంది .. ప్రస్తుతం ఆయన రేంజ్ ఊహించని రేంజ్ లో ఉంది .. దీంతో రాజమౌళి పై ఐటి అధికారులు దృష్టిపెట్టే అవకాశం ఉంది .. అందుకే ఆయన ఇంత జాగ్రత్తగా పడుతున్నాడు అటు నిర్మాత కేఎల్ నారాయణ కూడా రాజమౌళికి ఫుల్ సపోర్ట్ గా నిలుస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: