టాలీవుడ్ లో నిర్మాత దిల్ రాజు ఇప్పుడు చాలా స్పెషల్ అని చెప్పాలి .. ఒక బయ్యర్ గా .. ఒక డిస్ట్రిబ్యూటర్ గా .. ఒక ఎగ్జిబిటర్‌గా .. నిర్మాతగా టాలీవుడ్ ను లీడ్ చేసే పర్సన్ గా ... అలాగే తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవిలో కూడా ఉన్నారు. ఇలా టాలీవుడ్లో మల్టీపుల్ పర్సన్ గా పేరు తెచ్చుకున్నారు. సక్సెస్‌ఫుల్‌గా సినిమాలు తీశారు .. పంపిణీ చేశారు. కానీ గత కొంతకాలంగా దిల్ రాజుకు టైం సరిగ్గా లేదు. నైజాం లో పంపిణీ పరంగా గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఇక రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన గేమ్ ఛేంజర్ సినిమా ఆయన సహనాన్ని డబ్బును .. కాలాన్ని అన్నింటిని తినేసింది. ఈ సినిమాతో దిల్ రాజు దాదాపు 150 కోట్లు నష్టపోయినట్టు చెప్పాలి. అయినా కూడా దిల్ రాజు చాలా ప్రశాంతంగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అరి వీర బ్లాక్ బస్టర్ హీట్ అయింది. తల మీద నుంచి గేమ్ చేంజర్ భారం మొత్తం దించేసింది. గేమ్ ఛేంజర్ సినిమాకు వచ్చిన నష్టాలను సంక్రాంతికి వస్తున్నాను సినిమా భర్తీ చేసేసింది. దీంతో దిల్ రాజు కష్టాలు మర్చిపోయి నార్మల్ స్థితికి వచ్చేసారు.
ఇప్పుడు దిల్ రాజు చేతిలో తమ్ముడు సినిమా విడుదలకు రెడీగా ఉంది. విజయ్ దేవరకొండ సినిమా ప్రారంభమవుతుంది. నితిన్ తో బలగం వేణు డైరెక్షన్లో సినిమా మొదలు కావాలి. వీటితో పాటు మరికొన్ని కొత్త ప్రాజెక్ట్‌లు సెట్ చేసుకోవాలి. ఇక అమీర్ ఖాన్ తో వంశీ పైడిపల్లి సినిమా అనే వార్తలు వస్తున్నాయి .. అమీర్ ఖాన్ తో సినిమా అంటే భారీగా ఉండాలి బాగా టైం పడుతుంది. అలాగే ప్రభాస్ కూడా ఓ సినిమా దిల్ రాజుకు చేయాల్సి ఉంది. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి పెద్ద హీరోల ప్రాజెక్టులు దిల్ రాజు బ్యానర్ లో వచ్చే సూచనలు కనిపించడం లేదు. నిజానికి భారీ సినిమాల కన్నా సంక్రాంతి వస్తున్నాం లాంటి మిడిల్ రేంజ్ సినిమాలే ప్రస్తుతానికి దిల్ రాజు కు చాలా బెటర్ గా కనిపిస్తున్నాయి. గతంలో ఫిదా దొరికింది.. దిల్ రాజుకు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా దొరికింది. ఏది ఏమైనా దిల్ రాజు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసేలా కనిపిస్తోంది.