ఎందుకంటే డైరెక్టర్ అనుకున్న విధంగా ఆ సన్నివేశం రాకపోవడంతో అలా చేసినట్లు సమాచారం.ఇదే విషయాన్ని బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తెలియజేస్తూ పలు విషయాలు తెలియజేశారు. ముద్దు సీన్ తనకి చాలా తలనొప్పిగా మారిందని తాను ఎప్పుడూ ఊహించలేకపోయాను అంటూ తెలిపారు.. కాంచి సినిమాలో ఒక కిస్ సన్నివేశం ఉంటుంది.. లవర్స్ గా నటించిన మిస్తి నేను ముద్దు పెట్టుకునే సన్నివేశం షూటింగ్ సమయంలో ఇద్దరు కలిసి కిస్ చేసుకోబోతున్నాము.. కానీ ఆ సన్నివేశం ఎన్నిసార్లు చేసినా డైరెక్టర్ సంతృప్తి చెందలేదని తెలిపారు.
కట్ చెప్పినా మళ్లీ ముద్దు పెట్టుకోమంటారు అలా మొత్తం మాతో 37 టేకులు తీసిన తర్వాత ఓకే చెప్పారని అలా చేయడంలో తప్పులేదు కానీ మిస్తీ ఎక్కడ తనను అపార్థం చేసుకుంటుందో అంటూ చాలా ఇబ్బందిగా భయపడిపోయాను అంటూ తెలిపారు హీరో కార్తీక్ ఆర్యన్. అయినప్పటికీ ఆమె డైరెక్టర్ చెప్పినట్లుగా చేసిందని కానీ ఒకానొక దశలో తనకే చిరాకు వేసిందని తెలిపారు హీరో..చివరికి తనకి ముద్దు ఎలా పెట్టుకోవాలో మీరే చేసి చూపించండి సార్ అనే స్టేజ్ కి వెళ్ళిపోయానని తెలిపారు. కాంచీ సినిమా 2014లో విడుదల అయింది ఈ చిత్రాన్ని శుభాష్ గమ్ తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలై ప్రేక్షకులను కూడా మెప్పించినట్లు తెలుస్తోంది.