ఈ సినిమా తర్వాత కీర్తి చావ్లాకు చిత్ర పరిశ్రమలో కొన్ని అవకాశాలు వచ్చాయి .. ఈ ముద్దుగుమ్మకు వచ్చిన ఎన్నో గొప్ప అవకాశాలను ఈమె చేతులారా చేజార్చుకుంది .. మొదటి సినిమానే సూపర్ హిట్ అవడంతో ఈమె తర్వాత నటించే సినిమాల్లో రెమ్యూనరేషన్ అధికంగా కావాలంటూ ఈమె డిమాండ్ చేయడంతో ఈ ముద్దుగుమ్మను చిత్ర పరిశ్రమలో పక్కనపెట్టి ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకునే వారట .. ఈ విధంగా ఈ ముద్దుగుమ్మకు చిత్ర పరిశ్రమలో అవకాశాలు తగ్గిపోవటంతో ఇండస్ట్రీ నుంచి పక్కకు వెళ్లిపోయింది. అయితే ఇలా సినిమాలు తగ్గాక పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెట్ అవుతుందని అంతా అనుకున్నారు .. అందరూ ఊహించింది జరగలేదు .. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత జరిగే ఓ పనికి భయపడి పెళ్లికి దూరంగా ఉందట..
ఇంతకి ఆ పని ఏమిటంటే .. పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే పిల్లల్ని కనాల్సి ఉంటుంది .. అలా గర్భవతి అయిన తర్వాత హాస్పటల్ కి వెళ్లాల్సి ఉంటుంది .. అయితే చిన్నతనం నుంచి ఈ హీరోయిన్ కి హాస్పిటల్స్ డాక్టర్లన్నా ఎంతో భయమట. అందుకే పెళ్లి తర్వాత ఎక్కడ ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుందని భయంతో ఈ హీరోయిన్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయిందని అంటారు .. ఇప్పుడు ఈ హీరోయిన్ కు ఉన్న వింత భయం చూసి చాలామంది నవ్వుకుంటున్నారు .. మరి కొంతమంది చిన్నప్పటి నుంచి ఆస్పత్రికి వెళ్ళకుండా ఎవరైనా ఉంటారా అలాంటిది హాస్పిటల్ కి వెళ్లాల్సి వస్తుందని భయంతో పెళ్లి చేసుకోకుండా ఉంటారనేది అంతా ట్రాష్ అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు .. అయితే కీర్తి చావ్లా మాత్రం ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోయింది.