3,000 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాలు తెరకెక్కగా మొత్తం 241 సినిమాలు తమిళనాడులో విడుదలయ్యాయి. కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే తమిళ దర్శక నిర్మాతలు తెరకెక్కిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కోలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి గురించి తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు ఆ బడ్జెట్ లో సగం కలెక్షన్లను సాధించడంలో ఫెయిలవుతున్నాయి. కోలీవుడ్ ఇండస్ట్రీ సక్సెస్ రేట్ 5 నుంచి 10 శాతం మధ్యలో ఉండటం గమనార్హం. కొన్ని సినిమాలకు డిజిటల్ ప్రింట్, పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదని సమాచారం అందుతోంది. ప్రేక్షకులు ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఇష్టపడుతున్నారనే సంగతి తెలిసిందే.
కోలీవుడ్ ఇండస్ట్రీకి 2025 సంవత్సరం అయినా కలిసొస్తుందేమో చూడాల్సి ఉంది. కోలీవుడ్ డైరెక్టర్లు టాలీవుడ్ హీరోలతో సినిమాలను తెరకెక్కించి టాలీవుడ్ స్టార్స్ కు భారీ ఫ్లాపులను అందించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ ఇండస్ట్రీ దర్శకనిర్మాతలు నిర్మించే సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పవచ్చు. గతంలో కోలీవుడ్ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ఇక్కడ సైతం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించేవి. ఇప్పుడు మాత్రం కోలీవుడ్ సినిమాల డబ్బింగ్ హక్కులకు డిమాండ్ తగ్గిందనే చెప్పాలి. కోలీవుడ్ సినిమాల రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.