సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార.. వయసుకి మించి ఆఫర్లు అందుకుంటూన్న హీరోయిన్.. ఎందుకంటే కొత్త హీరోయిన్ లు వస్తున్నా కొద్ది పాత హీరోయిన్ల హవా తగ్గిపోతుంది.కానీ ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చినా కూడా నయనతార హవా తగ్గిపోదు అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఇప్పటికి కూడా ఆమె చేతిలో 7,8 ప్రాజెక్టులు ఉన్నాయి అంటే చాలామందికి ఆశ్చర్యమే.. కానీ ఆమె చేతిలో మలయాళ,తమిళ వంటి భాషల్లో కలిపి 7,8 సినిమాలు ఉన్నాయి. మరి అలాంటి నయనతార తాను ఒక్కో సినిమాకి ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.. నయనతార రెమ్యూనరేషన్ లో హీరోలను కూడా మించిపోయింది. ఎందుకంటే కొంతమంది టైర్ -2,టైర్ -3 హీరోలు సైతం నయనతార తీసుకునే పారితోషికం ముందు   పనికిరారు. మరి ఇంతకీ నయనతార రెమ్యూనరేషన్ ఎంతయ్యా అంటే.. ఒక్కో సినిమాకి దాదాపు పది నుండి 15 కోట్ల రెమ్యూనరేషన్ ని తీసుకుంటుంది. 

అలాగే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీకి గాను ఏకంగా 11 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంది. ఇక ఇప్పటివరకు 11 కోట్ల రెమ్యూనరేషన్ మన సౌత్ లో ఏ హీరోయిన్ కూడా అందుకోలేదు.కానీ మొదటిసారి నయనతార ఈ రెమ్యూనరేషన్ ని అందుకుంది. అంతేకాదు ఇప్పటివరకు సౌత్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న  హీరోయిన్ కూడా నయనతారనే అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక నయనతార కేవలం సినిమాలు మాత్రమే కాదు రెండు మూడు నిమిషాలు కనిపించే యాడ్ కోసం కూడా అత్యధిక పారితోషికం తీసుకుంటుంది. ఎందుకంటే నయనతార తాను చేసే ఒక్కో యాడ్ కోసం ఏకంగా ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇక మామూలుగా అయితే ఒక సినిమాకి ఐదు నుండి 6 కోట్ల వరకు తీసుకుంటుంది. స్టార్ హీరోల సినిమాలు అయితే ఆ రెమ్యూనరేషన్ డబల్ అవుతుంది.

అలా సౌత్ లో హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ నయనతార ఇండస్ట్రీలో ముందుకు వెళ్తోంది.. ఇక ప్రస్తుతం నయనతార రక్కాయి అనే లేడీ ఓరియంటెడ్ మూవీలో నటిస్తోంది. ఇక నయనతార పర్సనల్ విషయానికి వస్తే.. గతేడాది ఆమె రిలీజ్ చేసిన బియాండ్ ది ఫేయిరీ టెయిల్ అనే తన డాక్యుమెంటరీ కారణంగా చిక్కుల్లో పడింది.. అ డాక్యుమెంటరీ వల్ల నయనతార పలు వివాదాల్లో ఇరుక్కుంది. ఇక నయనతార కేవలం సినిమాలు మాత్రమే కాకుండా అటు సినిమాలు ఇటు యాడ్స్ తో పాటు కొన్ని బిజినెస్ లు కూడా చేస్తుంది. గత ఏడాది నయనతార ఫెమి9 అనే సానిటరీ పాడ్స్ సంస్థని కూడా స్థాపించింది. అలాగే ఈమెకు చెన్నైలో పలు బిజినెస్ లు కూడా ఉన్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: