చాలామంది హీరోయిన్లకి రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలు అన్యాయం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో తో పాటు హీరోయిన్ కూడా ఉండాలి. హీరోయిన్ ఉంటేనే సినిమా చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకి వస్తారు. కానీ హీరోలకు 100 కోట్లు ఇస్తే కనీసం అందులో 10 కోట్లు కూడా హీరోయిన్ కి ఇవ్వరు.5, 6 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే ఇస్తారు. ఇక ఈ విషయంలో మాత్రం హీరోయిన్లకు చాలా అన్యాయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హీరోకి 100కోట్లు ఇస్తే కనీసం 10,15 కోట్లయినా హీరోయిన్ కి ఇవ్వాలి.ఎందుకంటే హీరొయిన్ లేకపోతే సినిమా చూడడానికి థియేటర్లకే జనాలు రారు. ఇక హీరోలకు ఎక్కువ రెమ్యూనరేషన్స్ ఇస్తూ హీరోయిన్లకు తక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడం అనేది సినిమా ఇండస్ట్రీ మొదలైనప్పటినుండే ఉంది.

ఇక మన తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరు అంటే అందరూ అనుష్కనో లేక కాజల్, లేక సౌందర్య రమ్యకృష్ణ కావచ్చని అని ఇలా ఎంతమంది పేర్లు తెరమీద వినిపిస్తాయి. కానీ వీళ్ళు ఎవరు కాదు.వీళ్ళందరి కంటే ముందు కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న ఏకైక హీరోయిన్ ఇలియానా.అవును గోవా బ్యూటీ ఇలియానానే మన సౌత్ లో అందరికంటే ముందు కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందట.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్గా చేసింది.

 అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ నటిని అనుకున్నప్పటికీ ఆ హీరొయిన్ డేట్స్ ఖాళీగా లేకపోవడంతో కొత్త హీరోయిన్ అయినటువంటి ఇలియానా ని ఇందులో తీసుకున్నారు. ఇక ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ తర్వాత రవితేజతో ఇలియానా ఖతర్నాక్ మూవీలో నటించింది. ఇక అట్టర్ ప్లాప్ అయినా ఖతర్నాక్ మూవీకి ఇలియానా ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకొని సౌత్ ఇండస్ట్రీలోనే కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న మొదటి హీరోయిన్ గా ఇలియానా పేరు తెచ్చుకుంది.అలా ఫ్లాప్ అయినా సినిమాకి ఇలియానా రికార్డు రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకొని అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఇలియానా తెలుగులోకి దేవదాసు అనే మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఇలియానా మళ్లీ తల్లి అయినట్టు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: