ఇక కాజల్ తన కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుని వివాహం తర్వాత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక డెలివరీ అనంతరం కాజల్ పూర్తిగా మారిపోయింది. కాస్త బొద్దుగా, తన గ్లామర్ మొత్తం పోయింది. దీంతో కాజల్ కు సినిమా అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ పెద్దగా ముందుకు రాలేకపోయారు. ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే హీరోయిన్ చేస్తోంది. కాగా కాజల్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో కేవలం 50 లక్షల రెమ్యనరేషన్ మాత్రమే తీసుకునేదట.
తర్వాత కొద్ది రోజులకి తన రెమ్యూనరేషన్ కోటి నుంచి రెండు కోట్ల రూపాయలకు భారీగా పెంచిందట. ఇక వివాహం తర్వాత కాజల్ తన రెమ్యునరేషన్ ని ఏకంగా మూడు కోట్ల రూపాయలకు పెంచింది. భగవంతు కేసరి సినిమాలో నటించడానికి ఏకంగా మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ వసూలు చేసిందట. వివాహం తర్వాత కాజల్ భారీగా తన రెమ్యూనరేషన్ ని పెంచేసింది.
కాజల్ తన రెమ్యూనరేషన్ భారీగా పెంచినప్పటికీ తనతో సినిమాలు చేస్తున్నారు. అడిగినంత డబ్బులు ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. కాగా ప్రస్తుతం కాజల్ చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. కొద్దిరోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.