అయితే గత కొంతకాలంగా శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం కూడా వైరల్ గా మారింది. శ్రీ తేజ్ తల్లి రేవతి మృతి చెందడంతో ఈ విషయం తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది..అప్పటినుంచి ఇక బెనిఫిట్ షోలు ఏ సినిమాకి ఉండవని అసెంబ్లీలోనే తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు శ్రీ తేజ్. అయితే గత కొద్దిరోజులపాటు ఐసీఈ లో వెంటిలేటర్ పైన ఉంచిన వైద్యులు ఇప్పుడు సొంతంగా ఆక్సిజన్ పీల్చుకోవడంతో వెంటిలేటర్ ను తొలగించామంటూ తెలిపారు.
అయితే శశ్రీతేజ్ పేరు పెట్టి పిలిచిన కళ్ళు తెరిచి చూస్తాడు తప్ప మాట్లాడలేదని మనుషులను గుర్తుపట్టలేక ఉన్నారని తెలుపుతున్నారు. ఆరోగ్య పరిస్థితులు పెద్దగా మార్పు లేదని వైద్య సిబ్బంది కూడా ఫిజియోథెరపీ చేయిస్తున్నట్లుగా కిమ్స్ వైద్యులు తెలియజేస్తున్నారు. సంధ్య థియేటర్ జరిగిన ఘటనలో జనం తొక్కుకుంటూ పోవడం వల్ల కొంతమేరకు ఊపిరి ఆగిపోయింది అని సిపిఆర్ ద్వారా తిరిగి మళ్ళీ శ్వాస అందించారని.. అలాగే శ్రీ తేజ్ ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా సహాయం చేశారు. కుటుంబ సభ్యులు మాత్రం అక్కడే ఉంటున్నారట.