ఏంటి అమరన్ హీరో ఆస్తులు 45 వేల కోట్లా.. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉందే.. నిజంగానే ఆ హీరో అన్ని వేల కోట్లు వెనకేసాడా..బాలీవుడ్ టాప్ హీరోలు సైతం ఇప్పటివరకు అన్ని కోట్లు వెనకేయలేదే.. అలాంటిది అమరన్ హీరో మాత్రం 45 వేల కోట్లు ఎలా సంపాదించారబ్బా అని చాలామంది ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోతుంటారు. మరి ఇంతకీ ఆ 45 వేల కోట్ల సంగతి ఏంటి..ఎందుకు నేను 45 కోట్ల ఆస్తిని సంపాదించానని శివ కార్తికేయన్ ఆ ఇంటర్వ్యూలో అన్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. వరుస సినిమాలు చేస్తూ  కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయనన్ కి తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక ఈయన గత ఏడాది నటించిన అమరన్ సినిమా ద్వారా స్టార్ సెలబ్రెటీ హీరో హోదాకి వెళ్ళిపోయారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడంతో శివ కార్తికేయన్ కి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి.

ఇక ప్రస్తుతం శివ కార్తికేయన్ పరాశక్తి అనే సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమాలో జయం రవి విలన్ పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇదే టైటిల్ తో బిచ్చగాడు ఫేమ్ హీరో విజయ్ ఆంటోనీ కూడా తన కొత్త సినిమా ప్రకటించారు. అయితే ఇద్దరు హీరోలు ఒకేరోజు కొన్ని గంటల వ్యవధిలో  ఒకే టైటిల్ ఉన్న సినిమా పోస్టర్లని ప్రకటించడంతో చాలామంది షాక్ లో మునిగిపోయారు.ఈ విషయం పక్కన పెడితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ కార్తికేయన్ కి ఆస్తులకు సంబంధించి ఒక ప్రశ్న ఎదురైంది.దానికి ఎలాంటి సమాధానం ఇచ్చారో ఇప్పుడు చూద్దాం.. శివ కార్తికేయన్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో తన మాటలతో ఆ ఇంటర్వ్యూలో నవ్వులు పూయించారు. ఇందులో భాగంగా మీరు ఇప్పటివరకు ఎంత ఆస్తి సంపాదించారు..

మీకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి అని యాంకర్ అడగగా.. నేను అంబానీ ని అన్నీ లెక్కేస్తే 45 వేల కోట్ల వరకు ఉంటాయి. అంబానీ తర్వాత నేనే అంటూ నవ్వులు పూయించారు.అయితే 45 వేల కోట్ల ఆస్తులు అంటే ఏదో అలా సరదాగా శివ కార్తికేయన్ అన్న మాటే.. ఇది నిజం కాదు. ఎందుకంటే తిప్పి తిప్పి కొడితే ఆయన ఆస్తులు కనీసం 500 కోట్లు కూడా దాటవని మీడియా టాక్.. ఏది ఏమైనప్పటికి శివ కార్తికేయన్ తన మాటలతో ఆ ఇంటర్వ్యూలో నవ్వులు తెప్పించారు.ఇక శివ కార్తికేయన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఇందులో ఒకటి సుధా కొంగర డైరెక్షన్లో వస్తున్న పరాశక్తి మూవీ కాగా మరొకటి ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో చేస్తున్నారు. అమరన్ సినిమా తర్వాత కోలీవుడ్లో శివ కార్తికేయన్ గ్రాఫ్ ఒక్కసారి గా పెరిగిపోయింది

మరింత సమాచారం తెలుసుకోండి: