మనకు తెలిసిందే.. ఇండస్ట్రీలో అన్ని కాంబోలో సెట్ అవ్వాలి అన్న రూల్ లేదు . చాలామంది జనాలు కొత్త కొత్త కాంబోల కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్.. డైరెక్టర్స్ కూడా అలా ట్రై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ కొందరు మాత్రం అలాంటి కాంబో సెట్ అవ్వడానికి ఇష్టపడరు . కధ నచ్చక పోవడం కారణంగా కావచ్చు.. లేకపోతే మరి ఏ కారణమైన కావచ్చు . కొందరు అలా కొన్ని కాంబోలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించరు . అలా మిస్ అయిన కాంబో నే దీపికా పదుకొనే - బన్నీ .


దీపికా పదుకొనే గ్లోబల్ బ్యూటీ . బన్నీ పాన్ ఇండియా స్టార్ మరి వీళ్ళిద్దరి కాంబోలో సినిమా పడకపోవడం ఏంటి..? అడ్డుకున్నింది ఎవరు..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . అయితే వీళ్ళిద్దరి కాంబోలో చాలా సినిమాలు రావాల్సింది. మరీ ముఖ్యంగా రెండు సినిమాలు ఫైనలైజ్ అయినట్టే అయ్యి  లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయ్యాయి. ఆ రెండు మూవీలు మరేంటో కాదు బన్నీ కెరియర్ నే తిరగ రాసిన "పుష్ప" . అలాగే "జులాయి" మూవీ.



బన్నీ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్  హిట్స్ గా నిలిచిన ఈ రెండు సినిమాలలో మొదటిగా హీరోయిన్గా దీపికా పదుకొనెని అనుకున్నారట మేకర్స్. అయితే దీపిక పదుకొనే మాత్రం ఈ ఆఫర్స్ ని సున్నితంగా రిజెక్ట్ చేసిందట. "జులాయి" సినిమాలో ఇలియానా కన్నా ముందే దీపిక పదుకొనేను హీరోయిన్గా అనుకున్నారట త్రివిక్రమ్ శ్రీనివాస్. కానీ ఆమే రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత పుష్ప2 సినిమాలో కూడా ఆమెకు ఆఫర్ వచ్చిందట . కానీ డి గ్లామరస్ లుక్ లో కనిపించాలి అన్న కారణంగా దీపిక రిజెక్ట్ చేసిందట . ఇప్పుడు దీపికా నే ఎప్పుడెప్పుడు బన్నీ సినిమాలో నటిద్దామా..?? అంటూ ఈగర్ గా వెయిట్ చేసే స్థాయికి ఎదిగిపోయాడు అల్లు అర్జున్..!

మరింత సమాచారం తెలుసుకోండి: