అల్లు అర్జున్ తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరు గెస్ చేయలేకపోతున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి సంబంధించిన వార్తలు ఎన్ని వింటున్నామో..? ఎన్ని వైరల్ అవుతున్నాయో ..? అందరికీ తెలిసిందే . కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన అభిమానులతో ముచ్చటించిన సందర్భాలు లేనేలేవు . నిజానికి పుష్ప2 సక్సెస్ సెలబ్రేషన్స్ ని పాన్ ఇండియా వైడ్ ప్లాన్ చేశారు మూవీ మేకర్స్ . కానీ సంధ్యా థియేటర్ తొక్కిసలట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన కారణంగా అవన్నీ ఫ్లాప్ అయిపోయాయి. 


అసలు అల్లు అర్జున్సక్సెస్ ప్రమోషన్స్ లోనూ పాల్గొనను అంటూ తేల్చి చెప్పేసాడట . అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. రేపో మాపో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు అల్లు అర్జున్ అని ఫ్యాన్స్ ఆనందపడేలోపే అల్లు అర్జున్ కి సంబంధించిన ఈ వార్త ప్రచారంలోకి రావడం బన్నీ ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేక్ అయిపోయేలా  చేస్తుంది.  అల్లు అర్జున్ ఇకపై పాన్ ఇండియా సినిమాలలో నటించకూడదు అంటూ డిసైడ్ అయ్యారట .



పాన్ ఇండియా వైడ్ ఆయనకి ఎంత పాపులారిటీ ఉందో తెలిసిందే.  మరి అలాంటి ఫ్యాన్స్ ని అల్లు అర్జున్ హర్ట్ చేస్తారా..? అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి . అంతేకాదు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మహిళా మృతి చెందిన కారణంగా ఆమె మరణానికి ఎప్పటికీ తనని బ్లేమ్ చేస్తుంది ఇండస్ట్రీ అంటూ చాలా బాధపడిపోతున్నారట . ఆ కారణంగానే ఇలా పాన్ ఇండియా సినిమాలలో నటించకూడదు అంటూ డిసైడ్ అయ్యారట . మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ జనాలు మాత్రం ఓ రేంజ్ లో బన్నీ గురించి మాట్లాడుకుంటూ ఈ వార్తను ట్రెండ్ చేస్తున్నారు . అయితే కొంతమంది మాత్రం ఇది ఫేక్ అని అల్లు అర్జున్ ఎప్పటికూడా ఆ నిర్ణయం తీసుకోడు అంటూ మాట్లాడుతున్నారు.  చూద్దాం మరి అల్లు అర్జున్ ఎప్పుడు డైరెక్ట్ గా అభిమానులతో మింగిల్ అయ్యి నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్నాడో..???

మరింత సమాచారం తెలుసుకోండి: