ఇండస్ట్రీలో టైం ఎప్పుడైనా ఎలా అయినా మారిపోవచ్చు . దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటూ ఉంటారు "పూజ హెగ్డే"ను . ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. పూజ హెగ్డే కెరియర్ ఒకప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అందరికీ బాగా తెలిసిన విషయమే . ఆమె ఖాతాలో ఒకప్పుడు ఉన్న ఆఫర్స్ ఇప్పుడు లేకపోవడానికి కారణం స్వయాన ఆమె తీసుకున్న డెసిషన్సే అంటూ జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు . కెరియర్ స్టార్టింగ్ లో ఒక హిట్ కొట్టడానికి నానాతంటాలు పడుతూ అల్లాడిపోయిన పూజా హెగ్డే ..ఆ తర్వాత ఎలాగోలా హిట్స్ అందుకుంటూ క్రేజీ హీరోయిన్గా మారిపోయింది .


ఒకానొక టైం లో స్టార్ హీరోలకి మించిన స్థాయిలోనే ఆమె క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . కానీ బ్యాక్ టు బ్యాక్ ఆమె కమిట్ అయిన  సినిమాలు మొత్తం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారిపోవడంతో.. ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అయిపోవడంతో..ఇండస్ట్రీలో ఆమె ప్లేస్ వేరే హీరోయిన్ దక్కించుకునే స్థాయికి మారిపోయింది.  అయితే పూజా హెగ్డే ఇప్పుడిప్పుడే మళ్ళీ తన అకౌంట్లో సినిమాలు వేసుకుంటూ వస్తుంది.  కాగా రీసెంట్గా ఓ తెలుగు హీరో సినిమాలో అవకాశం కోసం మేకర్స్ ఆమె పేరుని సజెస్ట్ చేయగా అసలు "పూజ హెగ్డే నా సినిమాలో వద్దనే వద్దు" అంటూ తేల్చేసాడట .



అంతేకాదు ఒక హీరోయిన్ బయోపిక్ లో కూడా పూజ హెగ్డేను అనుకున్నాడట స్టార్ట్ డైరెక్టర్. అయితే పక్కన వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ మేరకు "పూజా హెగ్డే బయోపిక్స్ కి అస్సలు పనికిరాదు అని .. కేవలం రొమాంటిక్ యాంగిల్ లో మాత్రమే ఆమెను చూడొచ్చు..వాడొచ్చు అని ..నటనాపరంగా ఆమెలో పెద్ద చెప్పుకోతగ్గ ఎలిమెంట్స్ ఏవి లేవు "అంటూ పూజ హెగ్డే ను దారుణంగా ఇన్సెల్ చేస్తూ మాట్లాడారట ఆ మూవీ మేకర్స్. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాపం ఒకప్పుడు ఎలా ఉండే పూజా హెగ్డే ఇప్పుడు ఎలా మారిపోయిందో ..?

మరింత సమాచారం తెలుసుకోండి: