మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి అయినటువంటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమె నేను శైలజ అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఈమెకు తెలుగు లో మంచి విజయాలు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.

ఇక ఆ తర్వాత తమిళ్ లో కూడా వరుస పెట్టి సినిమాల్లో నటించి అందులో చాలా మూవీ లతో మంచి విజయాలు అందుకోవడంతో ఈ బ్యూటీ కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇలా చాలా సంవత్సరాల పాటు ఈమె తమిళ్ , తెలుగు సినిమాల్లో నటిస్తూ ఈ రెండు ఇండస్ట్రీలలో కూడా అద్భుతమైన స్థాయిలో కెరియర్ ను కొనసాగిస్తూ వచ్చింది. ఇకపోతే తాజాగా ఈమె బేబీ జాన్ అనే హిందీ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తోనే ఈమె హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా కోసం ఈమె తన పారితోషకాన్ని ఏకంగా డబల్ చేసినట్లు తెలుస్తోంది.

బ్యూటీ తమిళ్ , తెలుగు  సినిమా కోసం రెండు నుండి మూడు కోట్ల వరకు పారితోషకాన్ని తీసుకుంటూ వచ్చిందట. ఇక బేబీ జాన్ సినిమా కోసం ఏకంగా నాలుగు కోట్ల పారితోషకాన్ని తీసుకుందట. కొంత కాలం విడుదల అయిన బేబీ జాన్ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో , అంతకుమించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇలా కీర్తి సురేష్ బేబీ జాన్ మూవీ కోసం తన పారితోషకాన్ని ఒక్క సారిగా డబల్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: