ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ప్రశాంత్ నీల్ ఒకరు. ఈయన ఉగ్రం అనే కన్నడ సినిమా ద్వారా దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో కన్నడ సినీ పరిశ్రమలో ఈయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈ దర్శకుడు యాష్ హీరోగా కే జి ఎఫ్ చాప్టర్ 1 అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ ని పన్ ఇండియా మూవీగా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయడం , ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా ఇండియా వ్యాప్తంగా ప్రశాంత్ కి గుర్తింపు వచ్చింది.

ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందిన కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా అద్భుతమైన విజయం సాధించడంతో దర్శకుడిగా ఈయన క్రేజ్ మరింతగా పెరిగింది. ఇకపోతే ఆఖరుగా ఈ దర్శకుడు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ పార్ట్ 1 అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఇకపోతే చాలా కాలం క్రితమే ప్రశాంత్ , తారక్ హీరోగా ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విలువడింది. కానీ సలార్ పార్ట్ 2 సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక ఎన్టీఆర్ తో ప్రశాంత్ సినిమా స్టార్ట్ చేస్తాడు అని చాలా మంది భావించారు. కానీ ప్రశాంత్ , ఎన్టీఆర్ తో సినిమాను స్టార్ట్ చేసి అది మొత్తం పూర్తి అయ్యాక సలార్ పార్ట్ 2 షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

దానితో ప్రభాస్ అభిమానులతో పాటు ఎన్టీఆర్ అభిమానులు కూడా షాక్ అవుతున్నట్లు తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం ముందుగా సలార్ పార్ట్ 2 సినిమాను స్టార్ట్ చేసి దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాడు అని ప్రభాస్ అభిమానులు , సలార్ పార్ట్ 2 సినిమా తర్వాత తారక్ తో సినిమా మొదలు పెడతాడు అని ఎన్టీఆర్ అభిమానులు భావించారు. కానీ అలా కాకుండా ఆయన మొదట తారక్ తో మూవీ ని ఆ తర్వాత సలార్ 2 చేయనున్నట్లు వార్తలు రావడంతో ప్రభాస్ , తారక్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: