ఇదిలా ఉండగా.. లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జానాయ్ భోస్లేతో, సిరాజ్ ప్రేమలో ఉన్నాడని కూడా చాలానే వార్తలు వినిపించాయి. అప్పుడు సిరాజ్, అలాగే జానాయ్ భోస్లే కూడా ఆ వార్తలను ఖండించారు. దాంతో పాటుగా వారిద్దరి మధ్య అన్న చెల్లెళ్ల అనుబంధం ఉంది అంటూ వారు చెప్పుకొచ్చారు. ఇక దీంతో మహిరా శర్మతోనే సిరాజ్ ప్రేమలో ఉన్నట్లు అందరూ ఫిక్స్ అయ్యారు.
తాజాగా ఈ వార్తలపై మహిరా తల్లి సానియా శర్మ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ' అసలేం మాట్లాడుతున్నారు. వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. ప్రజలు ఎదైనా మాట్లాడుతారు. ఇప్పుడు నా కుమార్తె సెలబ్రిటీ కాబట్టి ఎటువంటి వార్తలు రావడం సహజం. వీటిని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఈ వార్త పూర్తిగా అబద్దం. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మకండి' అంటూ సానియా శర్మ చెప్పుకొచ్చింది. ఇక మహిరా శర్మ.. నాగిన్ 2, బేపనా ప్యార్, కుండలీ భాగ్యలాంటి సీరియల్స్ తో నటించి చాలా మంది మనసును దోచుకుంది. ఈమె నటనతో, అందంతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత ఈమె బిగ్ బాస్ కి వెళ్లి మరింత ఫేమ్ సంపాదించుకుంది. ఈమె ఇంతకు ముందే వేరే ఒక అబ్బాయితో రిలేషన్ లో ఉండి.. ఇటీవలే బ్రేక్ అప్ చేసుకుంది.