సఖి సినిమా చూడని వారుండారు. ఈ సినిమాకు అప్పటినుండి ఇప్పటివరకు ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ.. ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.  ఆ టైమ్ లో లవ్ స్టోరీ అంటే ఇదిరా అనిపించేలా ఉన్న సినిమా ఇది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. ఈ సినిమా తమిళ చిత్రం అలైపాయుధె చిత్రానికి అనువాదం. ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోగా ఆర్. మాధవన్ నటించాడు. ఆయనకు జోడీగా హీరోయిన్ శాలిని నటించింది. ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించాడు.
ఆ రోజుల్లోనే థియేటర్లలో ఈ సినిమా వంద రోజులకు పైనే ఆడింది. ఈ మూవీని తర్వాత హిందీలో సాతియా పేరిట కూడా రీమేక్‌ తీశారు. ఈ సినిమా తమిళం తో పాటుగా తెలుగు, హిందీ భాషలలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని పాత్రలకు మాధవన్, శాలిని ప్రాణం పొసరనే చెప్పాలి.  
అయితే ఈ సూపర్ హిర్ లవ్ స్టోరీని ఓ స్టార్ హీరో మిస్ చేసుకున్నారంట. మరి ఆ హీరో ఎవరో తెలుసుకుందాం రండి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మణిరత్నం ఆ హీరో ఎవరో చెప్పాడు. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సఖి సినిమా కోసం మొదట బాలీవుడ్‌ హీరోహీరోయిన్లను అనుకున్నానని చెప్పారు. తాను ఫస్ట్‌ షారూఖ్‌, కాజోల్‌తో ఈ సినిమా తీయాలనుకున్నరాని తెలిపారు. దాని కోసం ఈ సినిమా కధ షారూఖ్‌ దగ్గరకు వెళ్లి కూడా చెప్పారట. ఆయన కూడా కథ విని ఒప్పుకున్నారట. కానీ  అప్పటికి క్లైమాక్స్‌ సరిగ్గా కుదర్లేదని.. దాన్ని పక్కనపెట్టేసి షారూఖ్‌తో దిల్‌సే సినిమా చేశారాని చెప్పుకొచ్చాడు. ఆ మూవీ అయిపోయే సమయానికి సఖి క్లైమాక్స్‌ను తీర్చిదిద్ది తర్వాత మాధవన్, శాలిని తీసుకున్నట్లు ఆయన తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: