- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో ఒకప్పుడు నితిన్ సినిమా వస్తుంది అంటే చాలు మినిమం గ్యారంటీ అన్న అంచనాలు ఉండేవి .. అటు బయ్యర్లు కూడా నితిన్ సినిమాలు కొనుగోలు చేసేందుకు పోటీపడేవారు .. నితిన్ సినిమాలకు మంచి ఓపెనింగ్ అలాగే వారం రోజులపాటు ప్రేక్షకులు కూడా వచ్చేవారు .. అయితే గత కొన్ని సంవత్సరాలుగా నితిన్ వరుస పెట్టి డిజాస్టర్లు ఇస్తున్నారు .. ప్లాప్‌లు మీద ప్లాప్‌లు తగులుతున్నాయి .. నితిన్ సినిమాలకు మినిమం గ్యారంటీ ఓపెనింగ్స్ కూడా ఉండటం లేదు. ఇదంతా గతం తాజాగా నితిన్‌ నుంచి రాబోతున్న రెండు సినిమాలను పరిశీలిస్తే ఏమాత్రం బజ్‌లేదు నితిన్ హీరోగా రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.


ఒకటి వెంకి కుడుములు దర్శకత్వంలో రాబిన్ హుడ్ రెండోది వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు ఈ రెండు సినిమాలు మార్చిలో ఒకటి మేలో ఒకటి విడుదల చేసే పని జరుగుతుంది .. ఎందుకో నితిన్ సినిమాలు స‌రిగ్గా రావటం లేదు. రాబిన్ హుడ్ టీజర్ వదిలారు హడావుడి జరుగుతూ ఉండగా చిన్న ఈవెంట్ చేశారు .. ఇప్పటివరకు ఈ సినిమాకు రావలసిన బజ్ రాలేదు .. నిర్మాతలైన మైత్రి సంస్థ ఈ సినిమా మీద సరిగా దృష్టి పెడుతున్నట్టు కనిపించడం లేదు .. పైగా ఈ సినిమాకు 70 కోట్ల వరకు బడ్జెట్ అయినట్టు తెలుస్తోంది ..  కోట్లు చెబుతున్నారు కానీ బయ్యర్లు అంత ఆసక్తి కనపరచడం లేదు .. మైత్రి సంస్థ కావడంతో రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఉండవు.


రాబిన్ హుడ్ సినిమా సక్సెస్ అయితేనే తమ్ముడు సినిమా మార్కెట్ ఆధారపడి ఉంటుంది .. ఈ సినిమాకి కూడా దిల్ రాజు నిర్మాత అందుకే రిలీజ్ విషయంలో సమస్య లేదు. అయితే తమ్ముడు సినిమా మీద కూడా ఎలాంటి ఆసక్తి లేదు .. ఈ రెండు సినిమాలు మంచి ఓపెనింగ్ తెచ్చుకోవాలి మంచి కలెక్షన్లు తెచ్చుకోవాలి అప్పుడే నితిన్ కు కొన్నేళ్లపాటు కెరియర్ ఉంటుంది .. లేకపోతే నితిన్ అంటే టాలీవుడ్ దాదాపు మరిచిపోయే టైం దగ్గర పడుతుంది అనుకోవాల్సిందే ..

మరింత సమాచారం తెలుసుకోండి: