విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ మూవీ ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన 15 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది.

15 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో అద్భుతమైన స్థానంలో నిలిచింది. 15 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో హనుమాన్ సినిమా 5.33 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో ఉంది. అలా వైకుంఠపురం లో సినిమా 3.73 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో ఉంది. బాహుబలి పార్ట్ 2 సినిమా 2.95 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , ఎఫ్ 2 సినిమా 2.85 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది.

ఆర్ ఆర్ ఆర్ మూవీ 1.75 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలో కొనసాగుతూ ఉండగా , దేవర పార్ట్ 1 మూవీ 1.61 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలో కొనసాగుతుంది. కన్నడ డబ్బింగ్ సినిమా కాంతార మూవీ 1.63 కోట్ల కలెక్షన్లతో ఏడవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , పుష్ప పార్ట్ 2 మూవీ 1.61 కోట్ల కలెక్షన్లతో 8 వ స్థానంలో కొనసాగుతుంది. ఇక సంక్రాంతికి వస్తున్నాను సినిమా 1.52 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానంలో కొనసాగుతూ ఉండగా , మహేష్ బాబు హీరోగా రూపొందిన సరిలేరు నీకెవ్వరు సినిమా 1.38 కోట్ల కలెక్షన్లతో పదవ స్థానంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: