గత ఏడాది తమిళ సినిమాకు ఒక పీడకల అని భారతీయ సినిమా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి .. అమరన్ , మహారాజా , గరుడన్ లాంటి సినిమాల తప్ప చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లు అయ్యాయి .. గత ఏడాది తమిళ నిర్మాతలు దాదాపు 3,000 కోట్లతో 241 సినిమాలు నిర్మించి రిలీజ్ చేశారు .. అందులో కేవలం 18 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి .. అంటే 223 సినిమాలు ప్లాప్ అయ్యాయి .. మొత్తంగా చూసుకుంటే 1000 కోట్ల నూంచి 1200 కోట్లకు పైగా నష్టం మిగిల్చినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి ..
మరీ ముఖ్యంగా భారీ నష్టాలకు కారణం పెద్ద సినిమాలే సూర్య , కమలహాసన్ , రజనీకాంత్ సినిమాల్ల దెబ్బకు తమిళ సినిమా కుదేలు అయింది .సూర్య కంగువ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఏమాత్రం ఆకట్టుకోలేదు .. 350 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా కేవలం 16 కోట్ల మాత్రమే వసూలు చేసింది .. తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2 సినిమా 250 కోట్లతో నిర్మిస్తే కేవలం 150 కోట్లు మాత్రమే వసూలు చేసింది .. ఇక రజనీకాంత్ వేట్టయాన్ పరిస్థితి అలాంటిదే అయితే పై రెండు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కాస్త పరవాలేదు ..
ఇక విజయ్ గోట్ కూడా డిజాస్టర్ అయింది . 251 సినిమాలలో 18 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి అంటే సక్సెస్ రేట్ కేవలం 7% మాత్రమే అంటే 93% సినిమాలు గంగా పాలు అయ్యాయి .. ఇక ఇందులో 150 సినిమాలు కు అసలు డిజిటల్ ప్రింట్ పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదని అంచనా .. ఏడాదికి 250 సినిమాల నిర్మిస్తే అందులో కనీసం 30 నుంచి 40 సినిమాలు హిట్ అవ్వాలి కేవలం ఏడు శాతం సినిమాలు హిట్ అయ్యాయి అంటే ఎంత మొత్తం ఫీలయ్యాయో తెలుస్తున్నాయి .. ఇక గేమ్ చేజర్ కూడా తమిళంలో పెద్ద డిజాస్టర్ అయింది .. ఏది ఏమైనా ఈ ఏడాది అయినా తమిళ సినిమా సరైన సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి ..