తన తల్లితో దిగిన ఒక ఫోటోని సైతం షేర్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ సుందర్ ఎమోషనల్ గా మాట్లాడారు. కేరళలోని కూర్కేన్ చేరిలో అంజాత అపార్ట్మెంట్లో ఈమె అనారోగ్య సమస్యతో మరణించినట్లుగా తెలియజేశారు. ఈమె అంత్యక్రియలు సైతం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జరగబోతున్నట్లు తెలుస్తోంది. సుందర్ తల్లి వయసు 65 సంవత్సరాలు .. సినీ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు పొందిన గోపీసుందర్ తెలుగులో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఊపిరి, మజిలీ భలే భలే మగాడివోయ్ తదితర చిత్రాలకు సైతం సంగీతాన్ని అందించారట.
అయితే ఈ సంగీత దర్శకుడు ఇంట తల్లి మరణించింది అని వార్త తెలియడంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆయన అభిమానులు కూడా తల్లి మరణానికి సంతాపం తెలియజేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన పలువురు సినీ సెలబ్రిటీలు కూడా సంతాపం తెలియజేస్తున్నారు. గోపి సుందర్ తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, మలయాళం వంటి భాషలలో కూడా సంగీతంతో ప్రేక్షకులను బాగా అలరించారు. మరి రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు. చివరిగా గోపీసుందర్ 18 పేజీస్ వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించారు.