అల్లు అర్జున్ హీరోగా భారీ అంచనాలతో రూపొందించిన పుష్ప సెకండ్ పార్ట్ సినిమా గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పుష్ప ది రూల్ పేరుతో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పుష్ప ది రైజ్ రిలీజ్ అయినప్పుడే సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ ఉంటుందని ప్రకటించారు. అలా ప్రకటించిన దాదాపు మూడేళ్ల తర్వాత ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సుకుమార్ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడమే కాదు కలెక్షన్స్ కూడా ఒక రేంజ్ లో తెచ్చుకుంది. అయితే సినిమా రిలీజ్ అయిన నెల తరువాత మరో 20 నిమిషాల నిడివి పెంచుతూ సినిమా యూనిట్ మరొక వర్షన్ రీలోడేడ్ అంటూ రిలీజ్ చేసింది.ఈ క్రమంలో థియేటర్లలో ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. 20 నిమిషాల కోసం మళ్లీ థియేటర్‌కి వెళ్లాలా అనుకుంటారేమో అని సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది.

 కానీ పుష్పరాజ్ ఫ్యాన్స్ రీలోడెడ్‌ వెర్షన్‌ని థియేటర్‌లలో చూసేందుకు మొదటి ఆటకే క్యూ కట్టారు. పలు చోట్ల 75 శాతం మించి ఆక్యుపెన్సీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా యాడ్‌ చేసిన సన్నివేశాలు వస్తున్నప్పుడు ప్రేక్షకుల నుంచి అరుపులు, కేకలతో స్పందన దక్కింది. మొత్తానికి పుష్పరాజ్‌ ఫ్యాన్స్ రీలోడెడ్ వెర్షన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.ఇదిలావుండగా పుష్ప 2రేలోడెడ్ వెర్షన్ ఓటీటీ లోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ అవుతుంది. వాస్తవానికి పుష్ప 2మూవీ మాత్రమే ఈరోజు నుంచి అందుబాటులోకి వస్తుందని నిన్న ప్రకటించారు. రిలోడెడ్ త్వరలో రిలీజ్ అవుతుందని నెట్ ఫ్లిక్స్ తెలిపింది. కానీ ఫ్యాన్స్ కు సర్ప్రైజే ఇస్తూ 23నిముషాలు కలిపిన రిలోడెడ్ వెర్షన్ ను స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ మూవీ హిందీ, తమిళం, మలయాళం లో ప్రసారమవుతుంది.ఇక ఈ విషయాన్నీ సమస్థ అధికారికంగా ప్రకటించింది.ఇక ఈ విషయం తెలుసుకొని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: