ఇన్నాళ్లూ కంటెంట్‌కు ప్రాధాన్యమిస్తూ, తక్కువ పారితోషికం తీసుకుంటూ వచ్చిన సాయి పల్లవి, ఇప్పుడు తన మార్కెట్ స్థాయికి తగ్గ రెమ్యూనరేషన్ అందుకుంటోంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఆమె తండేల్ సినిమా కోసం భారీ మొత్తం అందుకుందట. గతంలో రెమ్యూనరేషన్ విషయంలో కాస్త వెనకడుగు వేసినా, ఇప్పుడు మాత్రం తన రేంజ్ ఏంటో చూపిస్తోంది.
చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'తండేల్' సినిమాలో నాగచైతన్యతో జోడీ కడుతోంది సాయి పల్లవి. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా భిన్నంగా ఉండబోతోందట. లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవికి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దక్కిందని తెలుస్తోంది.
ఇంతకుముందు సాయి పల్లవి సినిమాకు రూ.2 కోట్లలోపే తీసుకునేదని టాక్. కానీ ఇప్పుడు తండేల్ సినిమా కోసం ఏకంగా రూ.5 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఇది చైతూ కంటే ఎక్కువ అని కొందరు అంటున్నారు, అది నిజమో కాదో తెలియదు కానీ ఇది ఆమె కెరీర్లోనే అత్యధిక రెమ్యూనరేషన్. ఇప్పటివరకు మీడియం బడ్జెట్ సినిమాల్లో ఎక్కువగా నటించిన ఆమె, ఇప్పుడు ఒక పెద్ద నిర్మాణ సంస్థలో నటించడంతో తన మార్కెట్ రేంజ్ మరింత పెరగనుంది. సాయి పల్లవి సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. కమర్షియల్ సక్సెస్ కంటే కంటెంట్ ఉన్న సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది.
గతంలో 'పడి పడి లేచే మనసు' సినిమా కోసం తక్కువ పారితోషికం తీసుకుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు 'తండేల్' లాంటి భారీ బడ్జెట్ సినిమా చేస్తుండటంతో నిర్మాతలు ఆమెకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత సాయి పల్లవి మరిన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో కనిపించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.