టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా వారి హవాను కొనసాగిస్తారు. ఇక మరికొందరు అందం, నటన ఉన్నప్పటికీ పెద్దగా సినిమాల ద్వారా ఆకట్టుకోలేకపోతారు. అలాంటి వారిలో హన్సిక మోత్వాని ఒకరు. ఈ బ్యూటీ తెలుగులో దేశముదురు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హన్సిక వరుసగా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఎంతో మంది హీరోల సరసన హీరోయిన్ గా చేసి అభిమానుల మనసులను దోచుకుంది. తెలుగు, తమిళం, హిందీలో అనేక సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కొన్నేళ్ల తర్వాత ఇండస్ట్రీలో హన్సిక హవా తగ్గిపోయింది. సినిమాలలో పెద్దగా నటించలేదు. కొన్నేళ్లపాటు ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఈ బ్యూటీ కొన్ని రోజుల క్రితం ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ కతూరియా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.


వివాహం తర్వాత మళ్లీ సినిమాలలో నటించడానికి హన్సిక ఆసక్తిని చూపిస్తోంది. ఈ క్రమంలోనే హన్సిక తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందట. ఒక్కో సినిమాలో నటించడానికి రెండు కోట్ల రూపాయలు అడుగుతుందని సినీ ఇండస్ట్రీలో జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. కాగా, 15 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. మొదట ఒక్క సినిమాలో చేసినందుకు కోటి రూపాయలు వసూలు చేసేదట.


ఇప్పుడు ఏకంగా రెండు కోట్ల రూపాయలు తీసుకుంటుంది. అయినప్పటికీ తాను అడిగినంత ఇవ్వడానికి దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఇక సినిమాల ద్వారా హన్సిక భారీగా డబ్బులను సంపాదించిందని టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్, ముంబై విల్లాలు ఉన్నాయట. అంతేకాకుండా తన వద్ద ఖరీదైన కార్లు ఉండడం విశేషం. హన్సిక ఎప్పటిలాగే మళ్ళీ తెలుగులో సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: