తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నిర్మాతలు అందరూ భారీ బడ్జెట్ సినిమాలతో పాటు మీడియం రేంజ్ సినిమాలకు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజునే తీసుకోండి రీసెంట్గా సంక్రాంతికి .. గేమ్ చేంజర్ తో పాటు సంక్రాంతికి వస్తున్నాం అంటూ పెద్ద సినిమాతో పాటు చిన్న సినిమాతో బాక్సాఫీస్ ముందుకు వచ్చాడు .. ఈ సినిమాల రిజల్ట్ కూడా అందరికీ తెలిసిందే .. అదేవిధంగా మరో నిర్మాత నాగవంశీ కూడా సార్ , లక్కీ భాస్కర్ అంటూ మీడియం రేంజ్ హీరోలతో వరస విజయాలు అందుకుంటున్నాడు. సితార సంస్థలో భారీ బడ్జెట్ సినిమాలే కాదు .. దుల్కర్ సల్మాన్ , ధనుష్ లాంటి హీరోలతో లో బడ్జెట్ సినిమాలు కూడా ఎక్కువ వస్తున్నా .. ఇప్పుడు మ్యాడ్ 2 తో పాటు VD 12, రవితేజ మాస్ జాతర వంటి భారీ సినిమాలు కూడా వస్తున్నాయి ..
అదే విధంగా భారీ బడ్జెట్ సినిమాలకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్ గీత ఆర్ట్స్ నుంచి తండెల్ లాంటి పాన్ ఇండియా సినిమా కూడా వస్తుంది. నాగచైతన్య హీరోగా చందు మొండిటి దర్శకత్వంలో తండేల్ 80 కోట్లతో తెర్కక్కింది.. ప్రజెంట్ టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాలుకు భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మైత్రి మూవీస్ .. ఈ సంస్థ కూడా నితిన్ లాంటి మీడియం రేంజ్ హీరోతో రాబిన్ హుడ్ సినిమా చేస్తుంది. అలాగే మరో నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ కూడా 200 కోట్లతో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమాను నిర్మిస్తుంది .. ఇదే యువీ క్రియేషన్స్ మరో మెగా హీరోతో చిన్న సినిమా చేయడానికి రెడీ అవుతుంది . ఇలా టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాతలు అందరూ భారీ బడ్జెట్ సినిమాలతో పాటు మీడియం రేంజ్ సినిమాలుని ప్లాన్ చేస్తున్నారు.. ఇలా మొత్తానికి పెద్ద బ్యానర్స్ అన్ని బ్యాలెన్స్ ఇంగా ముందుకు వెళ్తున్నాయి.