జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న క్రేజీ కాంబినేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే కెజిఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాని అనౌన్స్ చేసాడో అప్పటి నుండి జూనియర్ అభిమానులు సదరు కాంబో అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారు. అయితే ఆ తరుణం రానే వచ్చినట్టు కనబడుతోంది. అవును, నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా సైలెంట్ గా జరిగిపోతోంది.

గత సంవత్సరం కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర' మూవీ రిలీజ్ కాగా సినిమా బాగానే ఆడినప్పటికీ, జూనియర్ అభిమానులు ఆశించినంత లేకపోవడంతో ఇపుడు అంతా ప్రశాంత్ నీల్ సినిమాకోసమే ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఇది శుభవార్తనే చెప్పుకోవాలి. ఎన్టీఆర్ 31 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగు వచ్చేవారం రెగ్యులర్ గా జరగబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ లు తమ సినిమాకు సంబంధించిన వర్క్ ని సైలెంట్ గా పూర్తి చేస్తున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి.

కాగా ఈ కాంబో పైన చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం పక్కా అని ఇప్పటికే చాలామంది అభిమానులు సోషల్ మీడియాలో శపధాలు చేస్తున్నారు. అయితే దానికి కారణం లేకపోలేదు! ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేసిన కేజిఎఫ్1, కేజీఎఫ్ 2, సలార్ సినిమాలు బక్షాఫీస్ ని షేక్ చేసాయి. దాంతో ఒక్కసారిగా ప్రశాంత్ నీల్ పేరు టాక్ అఫ్ ది టౌన్ అయ్యింది. మరి జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబో అంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే అని అంటున్నారు అభిమాన జనం. ఇకపోతే ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో రూ.1000 కోట్ల సినిమా పడలేదు. ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చినప్పటికీ ఈ సినిమా క్రెడిట్ పూర్తిగా ఎన్టీఆర్ కి ఇవ్వలేము. దేవర సినిమా కూడా 600 కోట్లతోనే సరిపెట్టుకుంది. ఇక నెక్స్ట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోయే సినిమానే వెయ్యి కోట్లు కలెక్షన్స్ చేస్తుంది అని నందమూరి ఫ్యాన్స్ లో ఒక నమ్మకం అయితే ఉంది. మరి వారి నమ్మకం ఏమవుతుందో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: