యంగ్ దర్శకులకు ఒక హీట్ వస్తే చాలు స్టార్ హీరోల నుంచి పిలుపు వస్తూ ఉంటుంది .. ఆదర్శకులు చెప్పిన కథ క్యారెక్టర్జేషన్ నచ్చితే చాలు హీరోలు కూడా దర్శకుల ప్రతిభ అనుభవాన్ని లెక్కలోకి తీసుకోకుండా సినిమాను ఓకే చేస్తూ ఉంటారు .. టాలీవుడ్ లో చందు మొండేటికీ మాత్రం ఈ 10 సంవత్సరాలలో ఐదు సినిమాలు చూస్తే అవి ఇద్దరు హీరోలతోనే ఎక్కువ‌ పరిమితం అయిపోయాడు .. అటు నాగ చైతన్య ఇటు నిఖిల్ తోనే వరస సినిమాలు చేసుకుంటూ వచ్చాడు .. కార్తికేయ , కార్తికేయ 2 ఈ రెండు సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి ..


ఇదే సమయంలో అగ్ర హీరోలతో పని చేసే ఛాన్స్ రాలేదు . అయితే భారీ అవకాశాలు మాత్రం వచ్చాయి .. వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు అంతే. నిఖిల్ తో కార్తికేయ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి చందు కు భారీ ఆఫర్ వచ్చింది .. కథ కూడా చెప్పాడు .. ఆయనకు బాగా నచ్చింది దాన్ని మరింత డెవలప్ చేసే ప్రోసెస్లో .  ఎన్టీఆర్ మిగిలిన సినిమాల హడావుడిలో పడిపోయాడు .. ఇదే క్రమంలో గీత ఆర్ట్స్ కూడా ఓ కథ చెబితే దాన్ని అల్లు అరవింద్  రామ్ చరణ్ తో చేయాలని చెప్పారు .. అయితే అప్పటికే రామ్ చరణ్ ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు .. చేతులు దాకా వచ్చిన అవకాశాలు మధ్యలోనే చేజారిపోయాయి ..


చందు కూడా నాగచైతన్య , నిఖిల్ తో కంఫర్ట్ జోలోని ఉండిపోయాడు ..ఈ  దర్శకుడు ఇందులో నూంచి  బయటకు రావాల్సి ఉంది .. ఇక్కడ ఒక సమస్య వచ్చింది. నాగచైతన్య తో తండేల్‌ సినిమా తర్వాత చందు నిఖిల్ తో కార్తికేయ 3 మూవీ చేయాల్సి ఉంది. అలాగే ఈ దర్శకుడకు వెంకటేష్ , నాగార్జునతో కలిసి ఓ భారీ మల్టీస్టార చేయాలనేది చందు మొండిటి కోరిక .. ఓ భారీ పోలీస్ స్టోరీ .. ఇప్పటికే స్టోరీ సిద్ధంగానే ఉంది .. వెంకటేష్ , నాగార్జున ను కలిపే నిర్మాత కావాలి .. ఈ ఇద్దరు కాంబినేషన్ పరంగా క్రేజ్ కూడా మామూలుగా ఉండదు. ఈ కాంబో చూసే అవకాశం ఎప్పుడు వస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: