సౌత్ నుంచి నార్త్‌ వరకు భారీ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్లో మిల్కీ బ్యూటీ తమన్న కూడా ఒకరు .. టాలీవుడ్ , కోలీవుడ్ లో సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరితో ఈమె సినిమాలు చేసింది .. తెలుగులో చిరంజీవి నుంచి సత్యదేవ్ వరకు అందరు హీరోలతో కలిసి సినిమాలు చేసింది .. ఇదే క్రమంలో టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో కలిసి సినిమాల చేసిన హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు .. టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకోగానే బాలీవుడ్ కి వెళ్లిపోయి అక్కడ కూడా పలు సినిమాలు చేసింది .. ఈమెకు బాలీవుడ్ లో పెద్దగా కలిసి రాలేదు .. దీంతో ఈ ముద్దుగుమ్మ  వయసు కూడా మూడుపదులు దాటిపోయింది.. దీంతో ఓటీటీలు వెబ్ సిరీస్, అడల్ట్ సినిమాల్లో నటిస్తూ కాలాన్ని నెట్టుకు వస్తుంది .. గతంలో సౌత్ సినిమాల్లో ముద్దు సన్నివేశానికి కూడా నటించడానికి ఇంట్రెస్ట్ చూప‌ని తమన్న బాలీవుడ్ లో మాత్రం ఏకంగా అడల్ట్ సన్నివేశాల్లో నటించి అందరికీ మంటలు పుట్టిస్తుంది.


ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయం పక్కనపడితే గత కొంతకాలంగా ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంద‌న్న విషయం తెలిసిందే .. విజయ్‌ వర్మ కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడే .. నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఎంసీఏ సినిమాతో విలన్ గా తెలుగులో అడుగు పెట్టాడు .. ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే విజయ్ నటిస్తున్నాడు .. తమన్న తో కూడా ఈ న‌టుడు ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే సినిమాలో మాత్రమే కలిసిన నటించాడు .. ఈ సిరీస్లో తమన్నాతో కలిసి విజయ్ చేసిన రచ్చ బాలీవుడ్ లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది .. గతంలో రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉంటూ వచ్చిన తమన్నా ఈ సిరీస్లో ఒక్కసారిగా రెచ్చిపోయేసరికి తమన్నా కూడా తన మనసులో మాటను .. బ‌య‌ట‌పెట్టింది .. విజయ్ నా కాబోయే భర్త అతనితో కాబట్టి ఇలాంటి హాట్ రొమాన్స్ చేశాను అని కవర్ చేసుకుంది .. అయితే ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా వీరి బ్రేకప్ చెప్పుకున్నట్టు సోషల్ మీడియాలో పలు వార్తలు బయటకు వస్తున్నాయి.


తాజాగా తమన్నా పెట్టిన ఒక పోస్ట్ చూసిన ఆమె అభిమానులు దాన్ని వేరె విధంగా అర్థం చేసుకుంటున్నారు .. ఇంత‌కు ఈ బ్యూటీ ఏమని పెట్టిందంటే .. ప్రేమని రహస్యంగా ఉంచాల్సిన పనిలేదు .. నన్ను ప్రేమించే వ్యక్తులకు సీక్రెట్ ఇంట్రెస్ట్ చూపించాల్సిన పని కూడా లేదు .. ఒకరు మిమ్మల్ని అందంగా చూడాలంటే ముందు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అందంగా చూడటం నేర్చుకోండి అంటూ ఆమె ఒక భారీ పోస్ట్ ను సోషల్ మీడియాలో పెట్టింది .. ఈ పోస్ట్ చూసిన ఆమె అభిమానులు ఇది ఈ ముద్దుగుమ్మ తన మనసుకు దగ్గరైన వాళ్లకు పరోక్షంగా భారీ కౌంటర్ ఇస్తూ పెట్టిందే అంటూ కామెంట్లు చేస్తూ వచ్చారు .. మరి కొంతమంది ఇది కచ్చితంగా విజయ్ వర్మకి ఆమె కౌంటర్ ఇస్తుందా.   వీరి మధ్య ఏమైనా గొడవలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు .. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. అలాగే తమన్నా ఈ పోస్ట్ ఎందుకు పెట్టిందో కూడా తెలియాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: