"ఈ రోజుల్లో ఎంత గొప్పగా సినిమా చేసిన ..ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా.. సోషల్ మీడియాలో మాత్రం నెగిటివ్ ప్రచారం కచ్చితంగా జరుగుతుంది. అది అందరికీ కామన్ . రాజమౌళి లాంటి స్టార్ దర్శకుడు బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేలా చేసినా బాహుబలి సినిమా ఫ్లాప్ అని .. బాహుబలి సినిమాలో కధ లేదు అని .. రాజమౌళి డైరెక్షన్ మిస్ అయింది అని రకరకాలుగా కామెంట్స్ వినిపించాయి. ఇదే విషయాన్ని లేవదీస్తూ బాబి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు ".
ఒకప్పుడు సోషల్ మీడియాలో నెగిటివ్ రివ్యూలు చాలా సరదాగా ఉండేటివి. కానీ ఇప్పుడు అవి సీరియస్ గా మారిపోయాయి. రాజమౌళి లాంటి వాళ్లకే ఆ ట్రోలింగ్ తప్పలేదు . ఇక మాలాంటోళ్లు ఎంత "డాకు మహరాజ్" సినిమాకి కూడా కొంతమంది నెగటివ్గా రివ్యూ లు ఇచ్చారు ..నెగటివ్ గా కామెంట్స్ కూడా చేశారు . అలాంటివి పెద్దగా పట్టించుకోను . మనలో దమ్ముంటే మన సినిమా చరిత్ర సృష్టిస్తుంది. చిరంజీవితో నేను చేసిన వాల్తేరు వీరయ్య సినిమాకి తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. కానీ బ్లాక్ బస్టర్ అయిందిగా . 100 కోట్లు కలెక్ట్ చేసింది గా.." అంటూ బాబి మాట్లాడాడు . దీంతో ఆయన మాట్లాడిన మాటలు నిజమే అంటూ కూడా జనాలు బాబీ మాటలను ఎంకరేజ్ చేస్తున్నారు. కాగా బాబీ నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడా అనేది సస్పెన్స్ గా మిగిలిపోయింది..!