విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ, హిందీలోనూ సినిమాలలో నటించి అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. విజయ్ సేతుపతి సినిమాలోకి రాకముందు చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగిన అనంతరం ఆయన సాదాసీదా జీవితాన్ని గడుపుతూ ఉండడం విశేషం. విజయ్ సేతుపతి తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. సహజమైన నటనతో మక్కల్ సెల్వన్ గా పేరు సంపాదించుకున్నాడు. 

విజయ్ సేతుపతి హీరోగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందు దుబాయ్ లో అకౌంటెంట్ గా కూడా పని చేశారు. తర్వాత ఇండియాకు వచ్చి ఓ థియేటర్ కంపెనీలో కూడా అకౌంటెంట్ గా చేరారు. తర్వాత సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఎలా అయినా హీరోగా రాణించాలని ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. హీరో, విలన్ పాత్రల్లో చేస్తూ ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నాడు. కాగా ఇతనికి భారీ సంఖ్యలో అభిమానులు ఉండడం విశేషం. తన సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.


కాగా, హీరో విజయ్ సేతుపతి మోడీ ప్రభుత్వానికి తనదైన శైలిలో ఓ విషయం గురించి రిక్వెస్ట్ చేశారు. పాన్ కార్డు వెబ్సైట్, సంబంధిత వివరాలను తమిళ భాషలో కూడా అందుబాటులోకి తీసుకురావాలంటూ హీరో విజయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇంగ్లీష్, హిందీ భాషలో మాత్రమే కాకుండా తమిళంలోనూ ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయం వల్ల తమిళ్ మాట్లాడే ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విజయ్ పేర్కొన్నారు. సమాచారం ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలని అన్నాడు.


లా ఉంటేనే ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉండవని హీరో విజయ్ సేతుపతి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విజయ్ సేతుపతి చేసిన రిక్వెస్ట్ పైన కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా, ప్రస్తుతం విజయ్ సేతుపతి సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. మూడు నాలుగు సినిమాలు తన చేతిలో ఉన్నాయని... మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని సమాచారం అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: