అలాగే జెడి చక్రవర్తి హీరోగా వచ్చిన సత్య మూవీ తెలుగు హిందీ భాషలో బారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది . ఈ సినిమాతో జెడి క్రేజ్‌ఒక్కసారిగా ఊహించని రేంజ్ కు వెళ్ళింది .. ఈ సీనియర్ హీరో రీసెంట్ గా పలు వెబ్ సిరీస్లో కూడా నటిస్తున్నాడు .. గతంలో దయ అనే వెబ్ సిరీస్ లోను నటించాడు .. అలాగే జీడీ చక్రవర్తి ఒక నటుడు గానే కాదు దర్శకుడుగా కూడా ఆయన ప్రతిభ చాటుకున్నాడు .. హోమం , సిద్ధం , మనీ మనీ మోర్ మనీ , ఆల్ ది బెస్ట్ అనే సినిమాలను తన దర్శకత్వంలో తీసుకువచ్చాడు. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో జెడి చక్రవర్తి మాట్లాడుతూ .. ఓ స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలని తనను అడిగిందని చెప్పుకొచ్చాడు .. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు అతిలోకసుందరి శ్రీదేవి ..
జె.డి చక్రవర్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. నేను హీరోగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు గతంలో హీరోయిన్ మహేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్లాను .. మహేశ్వరి , శ్రీదేవి ఇద్దరు దగ్గర బంధువులు. నేను మహేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఎక్కడ శ్రీదేవి తల్లి గారు ఉన్నారు .. లోపల నుంచి ఆమె నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చూసి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని ఎలాంటి మొహమాటం లేకుండా అడిగేసింది . అయితే ఆ సమయంలో శ్రీదేవి తల్లి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు .. ఆ సమయంలో ఆమె తల్లికి సర్జరీ కూడా జరిగింది .. సర్జరీ సమయంలో తలకు కుడివైపు చేయాల్సిన ఆపరేషన్ ఎడమవైపు చేశారట .. దాంతో ఆమె కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు .. అందుకే అలా మా కూతుర్ని పెళ్లి చేసుకో బాబు అని అడిగేసారట .. అయితే నిజానికి అది ఎంతో ఆనందించాల్సిన విషయం .. కానీ ఆమె పరిస్థితి తెలిసి సైలెంట్ అయిపోయానని జేడి చెప్పుకు వచ్చాడు . జె.డి చక్రవర్తి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారాయి.