బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వి కపూర్ ఈ బ్యూటీ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ కిడ్ గా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది తన సొంత టాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. కానీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక తన తల్లి శ్రీదేవి వలే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించాలనే ఉద్దేశంతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.


ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది వరుసగా సినిమాలలో అవకాశాలను అందుకుంటుంది. ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వి కపూర్. అంతేకాకుండా మరికొన్ని సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది.


ఇది ఇలా ఉండగా... మ్యాన్ ఫోర్స్ కండోమ్ కంపెనీ ఎండి సహ వ్యవస్థాపకుడు రాజీవ్ జునేజ తాజాగా ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. గతంలో మ్యాన్ ఫోర్స్ కండోమ్ ప్రకటనకు ప్రచార అంబాసిడర్ గా సన్నీలియోన్ వ్యవహరించారు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ఎంపికయ్యారు. రాజీవ్ జునేజ మాట్లాడుతూ జాన్వి కపూర్, రణబీర్ కపూర్ ల పేర్లను ప్రస్తావించగా.... ఇంకా ఎవరు సరిపోతారంటూ ప్రశ్నించారు.


కండోమ్ యాడ్ కోసం జాన్వి కపూర్ బెస్ట్ ఛాయిస్ అంటూ చెప్పుకొచ్చారు. పురుషులలో రణబీర్ కపూర్ బెస్ట్ అని రాజీవ్ జునేజ అన్నారు. ఈ ప్రకటనపై కొందరు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. జాన్వి కపూర్ ను అలా అనడంతో తన అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నా రు. కాగా, ప్రస్తుతం జాన్వీ కపూర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: