బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నాని సినిమాలో నటించింది. ఆ సినిమా అనంతరం తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి అభిమానులను ఆకట్టుకుంది. తెలుగులో మాత్రమే కాకుండా హిందీలోనూ అనేక సినిమాలలో అమీషా పటేల్ హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీకి దూరమైంది.

ఇక చాలా రోజుల గ్యాప్ తర్వాత అమీషా పటేల్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. రీసెంట్ గా గదర్-2 సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ బ్యూటీ వయసు 49 సంవత్సరాలు. అయినప్పటికీ ఇంక వివాహం చేసుకోకుండా తన లైఫ్ సింగిల్ గా కొనసాగిస్తోంది. వయసు పెరిగినప్పటికీ ఏమాత్రం తరగని అందం, ఫిట్నెస్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.


కాగా అమీషా పటేల్ వివాహం చేసుకొనప్పటికి చాలా మంది హీరోలతో ఎఫైర్ పెట్టుకున్నట్లు, ప్రేమ వ్యవహారాలు కొనసాగించినట్లు అనేక రకాల వార్తలు వచ్చాయి. కొంతమంది హీరోల పేర్లు కూడా తెరపైకి వచ్చినప్పటికీ వాటిలో ఎలాంటి వాస్తవం లేదు. తాజాగా సల్మాన్ ఖాన్ తో తన వివాహం గురించి అమీషా పటేల్ ఫన్నీగా స్పందించింది. మీ ఇద్దరూ బ్యాచిలర్. సల్మాన్ ఖాన్ చాలా అందగాడు, అర్హత ఉన్నవాడు. మీరు కూడా చాలా అందంగా ఉంటారు.

మీరిద్దరూ వివాహం చేసుకొని పిల్లలను కని పెంచండి. పిల్లల కోసమైనా మీరు వివాహం చేసుకోండి అని అభిమానులు అమీషాను అడగ్గా.... ఆ విషయంపై అమీషా పటేల్ చాలా ఫన్నీగా స్పందించింది. వావ్ అనిపించింది. ఇది చాలా గొప్ప కాజ్. అందమైన వ్యక్తులు కలిసి జీవించడాన్ని ప్రపంచం ఇష్టపడుతుందని నేను అనుకుంటున్నాను అంటూ అమీషా పటేల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమిషా పటేల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: