పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మధ్యలో ఖాళీ సమయం దొరికినప్పుడు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఆయన నటిస్తున్న సినిమాల్లో 'ఓజీ' ఒకటి. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. గ్యాంగ్ స్టర్ మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో 'ఓజీ' కి సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఓజీ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేసే విధంగా ఉండబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఓజీ సినిమాలో ఇంటర్వెల్ సీన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందట.

అది ఏంటి అంటే జనానికి అన్యాయం చేసిన పోలీస్ ఆఫీసర్ ను పవన్ కళ్యాణ్ పోలీస్ స్టేషన్ లోనే కొట్టి వాడి తల నరికి పోలీస్ స్టేషన్ నుంచి నుంచి బయటికి వస్తుంటారట. ఇక దాంతో ఇంటర్వెల్ పడుతుందని ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. మరి ఈ సీన్ కనుక ఇలాగే ఉన్నట్టయితే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందనేది మాత్రం చాలా క్లారిటీగా తెలుస్తుంది. మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేసి చూపించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా ఓజీ సినిమా చాలా బాగుంటుందని ఒక సందర్భంలో చెప్పడం వల్ల ఈ సినిమా మీద మంచి అంచనాలైతే పెరుగుతున్నాయి. ఇక దర్శకుడు సుజీత్ కూడా ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తుండటం విశేషం.ఇదిలావుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రియాంకా ఆరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా, శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: