హీరో నానిని అభిమానించే వాళ్లే కానీ అవమానించే వాళ్ళు ఎవరు ఉండరు.కానీ ఈ నిర్మాత మాత్రం నాని ది చీప్ మెంటాలిటీ అంటూ ఆయనపై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు.మరి ఇంతకీ నానిని అవమానించిన ఆ నిర్మాత ఎవరు? ఎందుకు నానిని అవమానించారు అనేది ఇప్పుడు చూద్దాం.. నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా అందరూ చూసే ఉంటారు.ఈ సినిమాకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా నా సినిమాని కాపీ కొట్టి తీశారు అంటూ తాజాగా కన్నడ నిర్మాత నానిని ట్యాగ్ చేస్తూ మరీ సోషల్ మీడియాలో వేదికగా ఆయనే అవమానించారు. శౌర్యువ్ డైరెక్షన్లో వచ్చిన హాయ్ నాన్న సినిమాలో నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. 

అయితే ఈ సినిమా విడుదలకు ముందు తమిళ్ మూవీ దాదాకి ఈ సినిమా రీమేక్ అని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదు అని నాని అండ్ టీం ఈ వార్తలు కొట్టి పారేశారు. అయితే సినిమా విడుదలైన రెండేళ్ల తర్వాత ఈ సినిమాకి సంబంధించి కన్నడ నిర్మాత సంచలన కామెంట్స్ చేశారు. నాని నటించిన హాయ్ నాన్న మూవీ నేను తీసిన భీమసేన నలమహారాజు మూవీకి రీమేక్ అని,నా సినిమాని కాపీ కొట్టి హాయ్ నాన్న తీసారని, రిమేక్ రైట్స్ కొనుక్కోకుండానే ఈ సినిమాను ఎలా తిరకెక్కిస్తారు అంటూ కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య నానిని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశాడు.

ఇక కన్నడ లో వచ్చిన భీమసేన నలమహారాజు సినిమాలో అరవింద్ అయ్యర్ హీరోగా నటించారు.. ఈ సినిమా అంతగా హిట్ అవ్వకపోయినప్పటికీ దీన్ని అమెజాన్ ప్రైమ్ లో కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాని కాపీ కొట్టి హాయ్ నాన్న తీసారు అంటూ తాజాగా కన్నడ నిర్మాత సోషల్ మీడియాలో నానిని ట్యాగ్ చేస్తూ ఇంతకంటే చీప్ పని మరొకటి ఉంటుందా అంటూ ఫైర్ అయ్యారు. దీంతో చాలామంది నెటిజన్స్ నిజంగానే నాని హాయ్ నాన్న మూవీ కాపీనా అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: