గతంలో పనిచేసిన సంస్థను తప్పించి వేరే సంస్థతొ విజువల్ ఎఫెక్ట్స్ చేయించడంతో ఆలస్యం అవుతూ వస్తుంది .. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ గురించి కూడా ఇంకా అధికార ప్రకటన రాలేదు .. కాగా ఇప్పుడు విశ్వంభరకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా కోసం వర్క్ చేయబోతున్నాడట.. ఈ సినిమా కోసం విజువల్ఎఫెక్ట్స్ , గ్రాఫిక్స్ పనులను దగ్గరుండి చూసుకోబోతున్నాడని ఒక వార్త బయటికి వచ్చింది .. కల్కి సినిమాలో హాలీవుడ్ సినిమాలుకు దీటుగా గ్రాఫిక్స్ విఎఫ్ ఎక్స్ ఔట్ పుట్ రాబెట్టిన నేపథ్యంలో నాగ్ అశ్విన్‌కి ఈ సినిమాకు సంబంధించిన ఈ పనులు కొంతకాలం పాటు పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారని అంటున్నారు .. ఇక దీంతో మెగా అభిమానులు ఎగ్జిట్ అవుతున్నారు .. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజముందు అనేది ఎవరికీ తెలియదు .
ప్రస్తుతం నాగ్ అస్విన్ కల్కి 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు .. ఇలాంటి క్రమంలో విశ్వంభర కోసం టైం కేటాయిచ్చే పరిస్థితుల్లో ఆయన లేరట .. అలాగే విశ్వంభర సినిమా యూనిట్ కూడా నాగ్ అస్విన్ని సంప్రదించటం అలాంటిదేమీ చేయలేదని కూడా సమాచారం .. సినిమాకు ముందు పని చేసిన విఎఫ్ఎక్స్ కంపెనీని తప్పించారు .. దాని స్థానంలో మరో పెద్ద సంస్థను తీసుకున్నారట .. ఈ విషయంలో నాగ్ అశ్విన్ నుంచో రాజమౌళి నుంచో సలహాలు అయితే తీసుకొని ఉండవచ్చు .. అంతేతప్ప మరో దర్శకుడుకి విఎఫ్ఎక్స్ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించే పరిస్థితి లేదని సమాచారం. అయితే ఇప్పుడు అంతా అనుకున్నట్టు జరిగితే చిరంజీవికి ఎంతో కలిసి వచ్చిన మే 9న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక మరి విశ్వంభర అనుకున్న టైం కు వస్తుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.