టాలీవుడ్ ఇండస్ట్రీ  నటి సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే సుప్రీత సోషల్ మీడియాను షేక్ చేసిందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. వరుస పెట్టి ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా రీల్స్ చేస్తూ వాటిని కూడా షేర్ చేస్తూ ఉంటుంది. 


తన తల్లితో కలిసి రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సుప్రీత కు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. తనకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉండడం విశేషం. తన అందంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ  నటి  సుప్రీత ఫోటోలకు, వీడియోలకు సోషల్ మీడియాలో భారీగా లైక్స్ వస్తూ ఉండడం విశేషం. కాగా, ఈ బ్యూటీ త్వరలోనే హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని అనేక రకాల వార్తలు వస్తున్నాయి. 


ఇప్పటికే బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ తో కలిసి ఓ సినిమా చేయనుంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇక లేటెస్ట్ గా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. తన అందాలను ఆరబోసి ఫోటోలను షేర్ చేసుకుంది. విదేశాలలో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను పంచుకుంది. 


బ్యూటీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే నలుగురు వ్యక్తుల తో ఎఫైర్ పెట్టుకుందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్ లో లేకపోవడం గమనార్హం. ఒకరి తర్వాత మరొకరికి బ్రేకప్ చెప్పుకుంటూ ప్రస్తుతం ఇప్పుడు సింగిల్ గా లైఫ్ ను ఎంజాయ్ చేస్తుందట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: