వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలది ప్రేమ వివాహం. చాలా సంవత్సరాల నుండి ఈ లవ్ బర్డ్స్ టాలీవుడ్ లో ప్రేమ పక్షులుగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఎక్కడ కూడా తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టడానికి ఇష్టపడలేదు.అలా సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఇండస్ట్రీలో ఉన్న కొంతమందికి తప్ప వీరి ప్రేమ విషయం ఎవరికి పెద్దగా తెలియదట. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరి రిలేషన్ పై రూమర్లు కుప్పలు తెప్పలుగా వచ్చేవి. అయినప్పటికీ ఈ జంట మాత్రం మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్సే అంటూ బుకాయించేవారు. కానీ ఫైనల్ గా అందరూ అనుకున్నట్టే ఈ జంట పెళ్లి చేసుకొని వైవాహిక బంధం లోకి అడుగుపెట్టింది. 2023 నవంబర్ 1న పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లయి సంవత్సరం పూర్తయింది.. అయితే ఇప్పటివరకు గుడ్ న్యూస్ చెప్పకపోయినప్పటికీ ఈ జంట ఎప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది.అయితే తాజాగా సోషల్ మీడియాలో లావణ్య త్రిపాటి మాట్లాడిన మాటలు వైరల్ గా మారుతున్నాయి. 

అదేంటంటే..లావణ్య త్రిపాఠి నా భర్త వరుణ్ తేజ్ కి నాకంటే పర్ఫెక్ట్ జోడిగా ఆ హీరోయినే సెట్ అవుతుంది అని మాట్లాడడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇంతకీ లావణ్య త్రిపాఠి కంటే పర్ఫెక్ట్ గా ఏ హీరోయిన్ వరుణ్ తేజ్ కి సెట్ అవుతుంది అని చెప్పిందో ఇప్పుడు చూద్దాం.. వరుణ్ తేజ్ ఇప్పటికే ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పూజ హెగ్డే, ప్రగ్యా జైస్వాల్, హెబ్బా పటేల్, లావణ్య త్రిపాటి, సాయి పల్లవి, రాశిఖన్నా,  మీనాక్షి చౌదరి, సాక్షి వైద్య,మానూషి చిల్లర్ వంటి ఎంతోమంది హీరోయిన్ లతో జతకట్టారు. కానీ ఇప్పటివరకు ఈ అందరు హీరోయిన్ల లోకెళ్ల వరుణ్ తేజ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది పూజ హెగ్డే, సాయి పల్లవి, రాశి కన్నా,లావణ్య త్రిపాఠి వంటి కొంతమంది హీరోయిన్ల పేర్లు మాత్రమే వినిపిస్తాయి. కానీ లావణ్య త్రిపాఠి ఉద్దేశంలో మాత్రం తన భర్తకి పర్ఫెక్ట్ జోడి తనకంటే సాయి పల్లవే  బాగుంటుందట.. 
అవును ఈ విషయాన్ని లావణ్య త్రిపాటి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. వరుణ్ తేజ్ కి నాకంటే పర్ఫెక్ట్ జోడి సాయి పల్లవి అంటూ మాట్లాడడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక వరుణ్ తేజ్ సాయి పల్లవి కాంబోలో వచ్చిన ఫిదా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలో వరుణ్ తేజ్ కంటే సాయి పల్లవి డామినేషన్ ఎక్కువగా కనిపించిందని,సాయి పల్లవి వల్లే సినిమా హిట్ అయింది అనే టాక్ కూడా అప్పట్లో వినిపించింది. అయితే ఈ సినిమా వల్లనే వరుణ్ తేజ్ కి హిట్ లభించింది అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు.ఎందుకంటే అప్పటివరకు వరుణ్ తేజ్ నటించిన నాలుగు సినిమాల్లో ఏ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవ్వలేదు.కానీ ఫిదా సినిమా మాత్రం పెద్ద హిట్ అవ్వడంతో సాయి పల్లవి వరుణ్ తేజ్ కి లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. సాయి పల్లవి వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి అంటూ ఆ ఇంటర్వ్యూలో సాయి పల్లవి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది లావణ్య త్రిపాఠి

మరింత సమాచారం తెలుసుకోండి: